twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జబర్దస్త్‌కి అనసూయ బై బై..? అంతా షాక్.. ఆ కండిషన్స్ ప్రకారం తప్పదు మరి..

    |

    అనసూయ.. బుల్లితెర, వెండితెర, ఆన్‌లైన్ తెర ఇలా అన్నిరకాల ప్రేక్షకులకు సుపరిచితం ఈ బ్యూటీ. కెరీర్ పరంగా గ్లామర్ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు జబర్దస్త్ యాంకర్‌గానే భారీ పాపులారిటీ ఉంది. ఎన్ని చేసినా అనసూయను చూడగానే గుర్తొచ్చేది ముందుగా జబర్దస్త్ మాత్రమే. అలాంటి ఆమె జబర్దస్త్ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పడనుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దామా..

    జబర్దస్త్ బ్యూటీగా సుస్థిర స్థానం.. అలుపెరగని జర్నీ

    జబర్దస్త్ బ్యూటీగా సుస్థిర స్థానం.. అలుపెరగని జర్నీ

    అలుపెరగని జర్నీ కొనసాగించి జబర్దస్త్ బ్యూటీగా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం ఏర్పర్చుకుంది అనసూయ. మొదట్లో ఓ నలబై ఎపిసోడ్స్ చేసి వదిలేద్దాం అనుకున్న జబర్దస్త్ నిర్వాహకులు.. ఆ షోకి వస్తున్న టీఆర్ఫీ రేటింగ్స్, డిమాండ్ చూసి నేటికీ కంటిన్యూ చేస్తున్నారు.

    పెరిగిన అనసూయ పాపులారిటీ.. బై బై జబర్దస్త్

    పెరిగిన అనసూయ పాపులారిటీ.. బై బై జబర్దస్త్

    మంచి పాపులారిటీతో జబర్దస్త్ జబర్దస్త్ జర్నీ 8 సంవత్సరాలుగా విరామం లేకుండా సాగుతూనే ఉంది. ఈ ఎనిమిదేళ్లలో అనసూయ పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వార్తలు అనసూయతో పాటు జబర్దస్త్ అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. జబర్దస్త్ షో నుంచి యాంకర్‌గా అనసూయ పూర్తిగా తప్పుకోనుందని వార్తలు వస్తున్నాయి.

    ఎఫెక్ట్ పడే సంగతే! నిర్వాహకులే కారణం

    ఎఫెక్ట్ పడే సంగతే! నిర్వాహకులే కారణం

    ఇప్పటికే ఈ షో నుంచి నాగబాబుతో సహా పలువురు టీం లీడర్స్ బయటకు వెళ్ళినప్పటికీ ఈ షోకి మాత్రం క్రేజ్ తగ్గలేదు. కానీ అనసూయ వెళ్లడం అనేది మాత్రం కాస్త ఎఫెక్ట్ పడే సంగతే అని క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇలా అనసూయ తప్పుకోవడానికి జబర్దస్త్ నిర్వాహకులే కారణం అని తెలుస్తోంది.

    అనసూయ లెఫ్ట్.. కారణం ఇదే!!

    అనసూయ లెఫ్ట్.. కారణం ఇదే!!

    జబర్దస్త్ షో మొదలు నుంచి అనసూయనే యాంకర్‌గా చేసుకుంటూ వస్తుంది. మధ్యలో వ్యక్తిగత కారణాల వల్ల షో కి దూరం అయినప్పటికీ మళ్ళీ తిరిగి ఎంట్రీ ఇచ్చి హల్చల్ చేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ షో పాటు జీ తెలుగులో ప్రసారం అయ్యే లోకల్ గ్యాంగ్‌లో కూడా జడ్జిగా వస్తోంది అనసూయ. ఇదే ఆమె లెఫ్ట్ కావడానికి అసలు కారణం అని టాక్.

    ఆ కండీషన్ చూపించి.. ఇలా

    ఆ కండీషన్ చూపించి.. ఇలా

    జబర్దస్త్ నిర్వాహకుల కండిషన్స్ ప్రకారం.. షోకి మెయిన్ లీడ్స్‌గా ఉన్నవారు ఇలా ఏకకాలంలో రెండు షోలలో కనిపించేందుకు వీలు లేదట. ఈ కండిషన్స్ కారణంగానే నాగబాబుతో సహా పలువురు జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం నడిచింది. ఇప్పుడు ఇదే కండీషన్ చూపించి అనసూయకు బై బై చెబుతున్నారట జబర్దస్త్ నిర్వాహకులు.

    తప్పించాలనే ఆలోచనతోనే..

    తప్పించాలనే ఆలోచనతోనే..

    ఈ మేరకు జబర్దస్త్ షో నుంచి పూర్తిగా అనసూయని తప్పించాలని ఆ షో నిర్వాహకులు భావిస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ప్రముఖ నటి , బీజేపీ నాయకురాలు ఫైర్ బ్రాండ్ మాధవిలతని ఆది స్కిట్‌లో చూపించారని టాక్.

    Recommended Video

    Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..! | Filmibeat Telugu
    అదే జరిగితే.. పెద్ద ప్రమాదమే

    అదే జరిగితే.. పెద్ద ప్రమాదమే

    నాగబాబు వెళ్ళిపోయినప్పుడే జబర్దస్త్‌కి కష్టం వస్తుందని ఉహించారంతా. కానీ అదృష్టవశాత్తు రోజాతో షో నడుస్తూ వస్తోంది. ఆ సంగతేమో గానీ.. షోకి ప్రధాన బలమైన యాంకర్ అనసూయ లెఫ్ట్ అయితే మాత్రం జబర్దస్త్‌ మనుగడకు పెద్ద ప్రమాదమే అని చెప్పుకుంటున్నారు ఈ వార్తలు చూసిన జనం. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో!.

    English summary
    Jabardasth with tagline Katharnak Comedy Show is Telugu-language television channel comedy television series. From this show Nagababu exit recently. As per latest talk now Anasuya also left from Jabardasth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X