మరో స్టార్ హీరో సినిమాలో అనసూయ స్పెషల్ రోల్
యాంకర్స్ మధ్య పోటీ ఎంత పెరిగినా కూడా కొందరి రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. అలాంటి వారిలో అనసూయ ఒకరు. జబర్దస్త్ అనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై కూడా అమ్మడు తనదైన శైలిలో రానిస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వరుసగా ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. వీలైనంత వరకు తనకు నచ్చిన పాత్రల్లోనే మెరిసింది.
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు కూడా అనసూయ పలు సినిమాలతో బిజీగా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో అనసూయ స్పెషల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే కృష్ణవంశీ రంగమార్తాండలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక రవితేజ ఖిలాడిలో కూడా ముఖ్యమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

ఇప్పటికే మీనాక్షి చౌదరి, డింపుల్ హాయాతి హీరోయిన్స్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అనసూయ కూడా ఒక పాత్ర కోసం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రూమర్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. ఇక ఖిలాడి సినిమా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. రాక్షసుడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న రమేష్ ఇదివరకే రవితేజతో వీర అనే సినిమా చేశారు. ఇక ఖిలాడి సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











