మరింత హాట్‌హాట్‌గా రంగమ్మత్త.. మెగాస్టార్ చిరంజీవితో స్పెషల్‌గా
తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తోంది. గతంలో చాలా మంది టాలెంట్‌తో మాత్రమే నెగ్గుకు వస్తే.. ఇప్పుడు మాత్రం గ్లామర్ షోతో పాపులర్ అవుతున్నారు. అయితే, కొందరు మాత్రం టాలెంట్‌తో పాటు గ్లామర్ కలిగి ఉండి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. బుల్లితెర యాంకర్‌గా పరిచయం అయిన కొద్ది రోజులకే ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఎన్నో ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులు మీకోసం.!

రెండు చోట్లా సక్సెస్.. పెరిగిన డిమాండ్
కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేసిన అనసూయ.. ఓ న్యూస్ చానెల్‌లో కూడా పని చేసింది. అయితే, జబర్ధస్త్ షోలోకి ఎంటర్ అయిన తర్వాత ఆమెకు బ్రేక్ వచ్చింది. ఈ షో పుణ్యమా అని అమ్మడికి ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి.. వస్తున్నాయి. వాటిలో కూడా మెప్పిస్తుండడంతో అనసూయకు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగిపోతోంది.

అనసూయ పరిస్థితికి ఆ రెండే కారణం
బుల్లితెరపై జబర్ధస్త్ షో అనసూయ కెరీర్‌కు పునాదిలా మారింది. అదే సమయంలో కొన్ని సినిమాలు కూడా ఆమె సినీ ప్రస్థానానికి బలమైన పునాదిని వేశాయి. అలాంటి వాటిలో ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలే. మరీ ముఖ్యంగా రంగమ్మత్తగా అనసూయ చేసిన అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

స్పైసీగా చూపిస్తున్న సీనియర్ డైరెక్టర్
ప్రస్తుతం అనసూయ ఎన్నో టీవీ షోలలో చేస్తోంది. వాటితో పాటు కొన్ని సినిమాలకు సైతం సంతకాలు చేసింది. ఇందులో సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ' ఒకటి. మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అది కూడా ఓ స్పైసీ రోల్ అని డైరెక్టరే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

బోల్డ్ సీన్స్.. బూతు మాటలు.. సీన్ రివర్స్
‘రంగమార్తండ'లో అనసూయ స్పైసీ రోల్ చేస్తుందని కృష్ణవంశీ ప్రకటించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘అంధాధున్' తెలుగు రీమేక్‌లోనూ అనసూయ బోల్డ్ రోల్ చేస్తుందని ప్రచారం జరిగింది. మాతృకతో టబు పోషించిన ఈ పాత్ర కోసం బూతు డైలాగులతో పాటు బోల్డ్ సీన్స్ చేయాల్సి ఉంది. కానీ, అందుకు ఆమె సిద్ధంగా లేదన్న టాక్ వినిపిస్తోంది.

ఊహించని రీతిలో అనసూయ అందాల ప్రదర్శన
తాజాగా అనసూయ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. అది కూడా గతంలో ఎన్నడూ కనిపించనంత హాట్‌గా ఇందులో దర్శనమివ్వబోతుందని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Recommended Video

యాంకర్ ‘హాట్' షో: ఏజ్‌తో సంబంధం లేకుండా.!
వాస్తవానికి ఈ మూవీలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇది ఇంటర్వెల్‌కు ముందు వస్తుందట. అలాగే, ఇదే మూవీలో మరో సాంగ్‌ను కూడా పెట్టబోతున్నారనేది తాజా సమాచారం. అందులోనే అనసూయ.. చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయబోతుందని అంటున్నారు. ఈ సాంగ్ కోసం భారీ డీల్ కుదరడంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో పని చేయబోతుందని టాక్.


Click it and Unblock the Notifications











