అనసూయ భరద్వాజ్ మరో గ్లామర్ ట్రీ‌ట్‌: అటు లవర్ బాయ్.. ఇటు యంగ్ హీరో.. గతంలో చూడని విధంగా!

కొన్నేళ్లుగా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై సత్తా చాటుతూ తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతోంది అనసూయ భరద్వాజ్. దాదాపు ఏడేనిమిదేళ్లుగా తన సత్తాను చూపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు నడుపుకుంటోంది. యాంకర్‌గా యమ పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నటిగానూ అదిరిపోయే ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ కారణంగానే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలోనే అనసూయ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఇందులో భాగంగానే మరో గ్లామర్ ట్రీట్‌కు రెడీ అయినట్లు తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

హాట్ హాట్‌గా ఇషా గుప్తా.. బీచ్‌లో బికినీతో హంగామా

జబర్ధస్త్‌గా మొదలైన కెరీర్.. వరుస ఆఫర్లతో

జబర్ధస్త్‌గా మొదలైన కెరీర్.. వరుస ఆఫర్లతో

బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వకముందే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోలోకి యాంకర్‌గా అడుగు పెట్టింది. అలా చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును దక్కించుకున్న ఆమె.. ఒక్కసారిగా బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది. దీని ద్వారానే ఎన్నో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

షర్ట్ బటన్ విప్పేసి షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్

సినిమాల్లోనూ సత్తా... ఆ పాత్రకు ప్రశంసలు

సినిమాల్లోనూ సత్తా... ఆ పాత్రకు ప్రశంసలు

బుల్లితెరపై అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుంటోన్న అనసూయ.. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన'తో టాలీవుడ్‌లోకీ ప్రవేశించింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనతో ఆకట్టుకుంది. అన్నింటిలో రంగమ్మత్త పాత్రకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక, ప్రతి ప్రాజెక్టులో దర్శక నిర్మాతల మొదటి చాయిస్ అవుతోంది.

హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న జీనల్ జోషి

ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన అనసూయ

ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన అనసూయ

వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. ఒకదాని తర్వాత ఒక ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకుంటోందామె. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోంది. అలాగే, 'థ్యాంక్యూ బ్రదర్'తో పాటు సునీల్ 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ'లోనూ కీలక పాత్రలు చేస్తోంది. అలాగే, పవన్ - క్రిష్ సినిమాలోనూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది.

అర్జున్ రెడ్డి పిల్ల హాట్ స్టిల్స్

ఆ సినిమాలో స్పెషల్ సాంగ్... సూపర్ హిట్

ఆ సినిమాలో స్పెషల్ సాంగ్... సూపర్ హిట్

కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇక, ఇందులో అనసూయ భరద్వాజ్ చేసిన 'పైన పటారం.. లోన లొటారం' అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్‌ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

పర్ఫెక్ట్ వయ్యారాలతో కనువిందు చేస్తున్న శివాని నారాయణన్

అనసూయ భరద్వాజ్ మరో గ్లామర్ ట్రీ‌ట్‌ రెడీ

అనసూయ భరద్వాజ్ మరో గ్లామర్ ట్రీ‌ట్‌ రెడీ

ఇప్పటికే చాలా సినిమాల్లో నటించడంతో పాటు కొన్నింటిలో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సాంగ్ చేయడానికి సిద్ధం అయినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అదే.. RX100 వంటి సూపర్ హిట్ తర్వాత ఆ చిత్రం దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న 'మహాసముద్రం' సినిమా అని తెలిసింది.

మాళవిక మోహనన్ బ్యూటీఫుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ఫోటోలు

అటు లవర్ బాయ్.. ఇటు యంగ్ హీరోతో రచ్చ

అటు లవర్ బాయ్.. ఇటు యంగ్ హీరోతో రచ్చ

'మహాసముద్రం'లో యంగ్ హీరో శర్వానంద్.. లవర్ బాయ్ సిద్దార్ధ్ కలిసి నటిస్తోన్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తుందట. అదిరిపోయే మాస్ నెంబర్‌కు ఇద్దరు హీరోలతో కలిసి డ్యాన్స్ చేయనుందని అంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ పాటలో ఆమె కనిపించబోతుందని తెలుస్తోంది.

పాయల్ అనుకున్నారు.. కానీ, అనసూయతో

పాయల్ అనుకున్నారు.. కానీ, అనసూయతో

వాస్తవానికి 'మహాసముద్రం'లో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేస్తుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు అనసూయను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఈ మూవీలో ఈ చిత్రంలో అదితి రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఇది ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X