Kanyasulkam: వేశ్య పాత్రలో అనసూయ.. పవన్ డైరెక్టర్ ప్లాన్‌‌తో యాంకర్ సాహసం

తెలుగు బుల్లితెరపై అదిరిపోయే హోస్టింగ్‌తో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోన్న వారిలో హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఇండస్ట్రీలోకి ఆలస్యంగానే ఎంట్రీ ఇచ్చినా ఈ భామ.. అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

అదే సమయంలో సినిమాల్లోనూ తనదైన యాక్టింగ్‌ మెస్మరైజ్ చేస్తోంది. ఫలితంగా మరిన్ని చిత్రాల్లో భాగం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనసూయ భరద్వాజ్ వేశ్య పాత్రను పోషించేందుకు రెడీ అవుతుందట. టాలీవుడ్‌కు చెందిన ఓ బడా డైరెక్టర్ వేసిన ప్లాన్‌తో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

జబర్ధస్త్‌గా మారిన అనసూయ కెరీర్

జబర్ధస్త్‌గా మారిన అనసూయ కెరీర్

అనసూయ 'నాగ' అనే సినిమాలో తళుక్కున మెరిసి.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని న్యూస్ యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షో ద్వారా హోస్టుగా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన హోస్టింగ్ చేసి భారీ స్థాయిలో పాపులర్ అయింది. దీంతో వరుసగా షోలు మీద షోలు చేసుకుంటూ అనసూయ తెలుగులో స్టార్ యాంకర్‌గా మారిపోయింది.

సినిమాల్లోనూ హవానే.. హిట్లే హిట్లు

సినిమాల్లోనూ హవానే.. హిట్లే హిట్లు

టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న అనసూయ.. సినిమాల్లోనూ హవాను చూపిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్‌లనూ సందడి చేసేస్తోంది.

భారీ ప్రాజెక్టుల్లో భాగమైన యాంకర్

భారీ ప్రాజెక్టుల్లో భాగమైన యాంకర్

అనసూయ భరద్వాజ్ కొంత కాలంగా బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా మరిన్ని భారీ ఆఫర్లను కూడా అందుకుంటూ దూసుకెళ్తోంది.

జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పిందని టాక్

జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పిందని టాక్

ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటుతోంది. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తోంది. ఇక, ఇటీవలే ఆమె జబర్ధస్త్ నుంచి కూడా తప్పుకుందని ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.

వేశ్య పాత్రను చేయబోతున్న భామ

వేశ్య పాత్రను చేయబోతున్న భామ

వరుసగా సినిమాలు, షోలు చేసుకుంటూ సత్తా చాటుతోన్న అనసూయ భరద్వాజ్.. ఛాలెంజింగ్ పాత్రలు వస్తే వెంటనే ఒప్పుకుంటోంది. ఇలా ఇప్పటికే ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతుందని తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటించబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది.

కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర

కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర

గురజాడ అప్పారావు రాసిన 'కన్యాశుల్కం' నవల ఆధారంగా తెరకెక్కనున్న వెబ్ సిరీస్‌లోనే అనసూయ నటిస్తోంది. ఇందులో ఆమె మధురవాణి అనే వేశ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సిరీస్‌ను దక్షిణాదిలోని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం.

పవన్ డైరెక్టర్ ప్లాన్‌తోనే ఈ సాహసం

పవన్ డైరెక్టర్ ప్లాన్‌తోనే ఈ సాహసం

'కన్యాశుల్కం' వెబ్ సిరీస్‌కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్క్రిప్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆయనే దీన్ని స్వయంగా నిర్మించబోతున్నారట. ఈ స్టార్ డైరెక్టర్ సూచన మేరకే మధురవాణి పాత్రకు అనసూయ భరద్వాజ్‌ను తీసుకున్నారని అంటున్నారు. ఇక, దీనికి మాత్రం క్రిష్ కాకుండా ఆయన శిష్యుడు దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X