చిరంజీవితో జబర్దస్త్ బ్యూటీ రొమాన్స్! ప్లాన్ రెడీ చేసిన డైరెక్టర్.. ఇదీ అసలు మ్యాటర్

బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీ అనసూయ చిందులకు ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక వెండితెరపై తన స్టెప్పులతో హుషారెత్తించడంలో చిరంజీవిని మించిన హీరో లేదని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో చిందేస్తే..! అబ్బో.. ఆ కిక్కే వేరులే. అయితే అది నిజం చేసేలా ప్లాన్ రెడీ చేశారట డైరెక్టర్ కొరటాల శివ. ఆ వివరాలేంటో చూద్దామా..

Recommended Video

Chiru 152 | Anchor Anasuya To Surprise Fans In Mega Film | Acharya
మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌.. జబర్దస్త్ బ్యూటీ

మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌.. జబర్దస్త్ బ్యూటీ

తన ఒంపు సొంపులతో బుల్లితెరకు కొత్త శోభ తీసుకొచ్చిన అనసూయ.. వెండితెరపై కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. విలక్షణ పాత్రలు పోషిస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెర అన్నట్లుగా సాగుతున్న ఆమె ప్రయాణం మెల్లగా మెగా హీరోల కంట పడింది. దీంతో మెగా హీరోలకు మెయిన్ ఆప్షన్‌గా మారింది అనసూయ.

చిరంజీవితో అనసూయ.. స్పెషల్ కిక్

చిరంజీవితో అనసూయ.. స్పెషల్ కిక్

ఇన్నాళ్లు బుల్లితెరపై మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి జబర్దస్త్ షోలో యమ హంగామా చేసిన ఈ జబర్దస్త్ బ్యూటీ.. ఇక మెగాస్టార్ చిరంజీవితో చిందులేసేందుకు రెడీ అయిందట. కొరటాల శివ- చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో అనసూయ కిక్ మరింత స్పెషల్ కానుందట.

అనసూయను కన్ఫర్మ్.. చిరంజీవి - రెజీనా ఐటమ్ సాంగ్

అనసూయను కన్ఫర్మ్.. చిరంజీవి - రెజీనా ఐటమ్ సాంగ్

'ఆచార్య' సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ కోసం అనసూయను కన్ఫర్మ్ చేశారట కొరటాల. ఈ మేరకు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. కాగా ఇదే సినిమాలో చిరంజీవి - రెజీనా కాంబినేషన్లో ఓ ఐటమ్ song షూటింగ్ ఇప్పటికే ఫినిష్ అయిన సంగతి తెలిసిందే.

ఇదీ ప్లాన్.. అనసూయకు భలే ఆఫర్

ఇదీ ప్లాన్.. అనసూయకు భలే ఆఫర్

చిరంజీవి - రెజీనాలపై షూట్ చేసిన ఆ ఐటమ్ సాంగ్.. ఇంటర్వెల్‌కి ముందు వచ్చేలా, అదేవిధంగా చిరంజీవి - అనసూయలపై షూట్ చేయబోయే ఈ స్పెషల్ సాంగ్ ఇంటర్వెల్‌ తర్వాత వచ్చేలా ప్లాన్ రెడీ చేశారట కొరటాల శివ. ఇందులో అనసూయ చాలా హాట్‌గా కనిపించనుందని, అందుకోసమే ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది.

త్రిష అవుట్.. కాజల్ ఇన్

త్రిష అవుట్.. కాజల్ ఇన్

మెగాస్టార్ కెరీర్‌లో 152వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో మొదట త్రిష హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. కానీ తీరా ఆమె పార్ట్ షూటింగ్ సమయానికి తప్పుకోవడంతో కాజల్‌ని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ మూవీ షెడ్యూల్ వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X