యాంకర్ అనసూయ ఐటం వేషాలు?
హైదరాబాద్ : యాంకర్‌గా పలు తెలుగు టీవీ కార్యక్రమాల్లో ఒకప్పుడు యమా బిజీగా గడిపిన ఉదయభాను....ఆ తర్వాత సినిమాల్లో ఐటం గర్ల్‌గా మారిన సంగతి తెలిసిందే. తన సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఉదయభాను.
సినిమాల్లో బిజీగా మారడంతో ఉదయభాను ఈ మధ్య టీవీల్లో కనిపించడం మానేసింది. ఇదే సమయంలో బల్లితెరపై చెలరేగిపోతూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది యాంకర్ అనసూయ. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది.

చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. ఆమె వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతెచ్చి పెడుతున్నాయని బుల్లితెర ప్రేక్షకుల అభిప్రాయం. మరో వైపు తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ కూడా మెయింటేన్ చేస్తోంది అనసూయ.
సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలనే లక్ష్యంతోనే అనసూయ ముందుకు సాగుతోందని, ప్రస్తుతం ఆమె ఐటం సాంగుల అవకాశాల కోసం ఎదురు చూస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. అలా ఒక్కో అడుగు వేస్తూ సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోందట.


Click it and Unblock the Notifications











