రంగమ్మత్త ప్లేస్‌లోకి రత్తాలు.. అనసూయ మిస్ చేసుకుందా!

దక్షణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మూడు రకాల జోనర్ చిత్రాలకు మంచి క్రేజ్ నెలకొని ఉంది. బయోపిక్ చిత్రాలు, బోల్డ్ కంటెంట్ చిత్రాలు, లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఓ మోస్తరు క్రేజ్ ఉన్న నేటీమణులని ప్రధాన పాత్ర దారులుగా పెట్టి చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. అలాంటి చిత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. యాంకర్ అనసూయ టాలీవుడ్ లో నటిగా కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అనసూయ ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకుందనే ప్రచారం జరుగుతోంది.

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి

జూలీ2 లో రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించింది. ఆ చిత్రంలో రాయ్ లక్ష్మి అందాలని ఆరబోసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తరువాత ఈ రత్తాలు ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

అనసూయకు అవకాశం

అనసూయకు అవకాశం

ఈ చిత్రంలో మొదట అవకాశం అనసూయకే వచ్చిందని ప్రచారం జరుగుతోంది. రంగస్థలం చిత్రంతో అనసూయ క్రేజ్ పెరిగింది. క్షణం చిత్రం తరువాత అనసూయ ఆచి తూచి సరైన పాత్రలని ఎంపిక చేసుకుంటోంది. ఆ క్రమంలో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రాన్ని రిజెక్ట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాయ్ లక్ష్మి రెండు భాషల్లో

రాయ్ లక్ష్మి రెండు భాషల్లో

ఈ చిత్ర విషయంలో మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. వేర్ ఈజ్ది వెంకటలక్ష్మి చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి రాయ్ లక్ష్మి క్రేజ్ ఈ చిత్రానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అవకాశం ఆమె చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల తరువాత

సినిమా విడుదల తరువాత

మొత్తంగా వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రం అనసూయ చేజారింది. అనసూయకు దక్కకుండా పోయిన ఈ ఆఫర్ మంచిదా కదా అనేది చిత్ర విడుదల తరువాత మాత్రమే తేలనుంది. ప్రస్తుతం అనసూయ కథనం, సచ్చింది గొర్రె చిత్రాలలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X