నక్క తోక తొక్కిన అనసూయ.. దెబ్బకి మారిన పుష్ప లెక్కలు!
టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అనుకోని రీతిలో ఇప్పుడు నటిగా బిజీ అవుతోంది. ఆమెను దృష్టిలో పెట్టుకుని కొంతమంది సినిమాలు రాసుకుంటుంటే మరికొంత మంది దర్శకులు మంచి పాత్రలు డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ నక్క తోక తొక్కిందని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

జబర్దస్త్ క్రేజ్
జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ యాంకర్ గా చాలా క్రేజ్ తెచ్చుకుంది.. ఒకానొక సమయంలో గురువారం వస్తుందంటే అనసూయని చూడడానికి సైతం చాలామంది జబర్దస్త్ ప్రోగ్రాం చూసే వాళ్ళు అంటే అతిశయోక్తి కాదు. ఈమెకు టెలివిజన్ లో వచ్చిన క్రేజ్ ను సినిమా నిర్మాతలు వాడుకోవడానికి ప్లాన్ చేశారు. అలాగే ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి.

రంగమ్మత్తగా మారి
రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రిలీజైన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమె మరింత క్రేజ్ సంపాదించింది. భర్తను కోల్పోయినా ఆ విషయం బయటపడకుండా అందరితో కలుపుగోలుగా ఉండే పాత్రలో నటించి చివర్లో ఏడిపించేసింది. అంత టాలెంట్ ఉంది కాబట్టే అనసూయకు వరుస సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఆమె వయసుకు తగ్గ రోల్స్ ఇస్తూ నిర్మాతలు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.

పుష్పలో ఛాన్స్
ప్రస్తుతం అనసూయ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో మంచి క్రేజ్ దక్కించుకున్న కారణంగా అనసూయ కోసం సుకుమార్ మరోసారి పుష్ప సినిమాలో ఒక పాత్ర క్రియేట్ చేశారు. అయితే జరుగుతున్న ప్రచారం మేరకు రంగస్థలం సినిమాలో లాగా పుష్ప సినిమాలో అనసూయ చేస్తున్నది అంత చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ కాదట.

సునీల్ భార్యగా
ఈ సినిమాలో సునీల్ భార్యగా ఆమె కేవలం ఒక మూడు నాలుగు సీన్స్ లో మాత్రమే కనిపిస్తుందట. అవి కూడా పెద్దగా నిడివి ఎక్కువగా ఉండవు అని, చాలా తక్కువ నిడివి ఉన్న సీన్స్ లో ఆమె నటించిందని అన్నారు. మొత్తం కలుపుకున్నా ఐదు-ఆరు నిముషాలకు మించి అనసూయ కనిపించదట. అయితే ఇదంతా కొద్ది రోజుల క్రితం వరకూ జరిగిన ప్రచారం కాగా ఇప్పుడు పూర్తిగా లెక్కల మారిపోయాయి. పుష్ప సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఈ మధ్యకాలంలో యూనిట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అలా కలిసి రావడంతో
అయితే ఇప్పుడు ఇదే అంశం అనసూయకు బాగా కలిసి వచ్చిందని అంటున్నారు.. లెక్క ప్రకారం సుకుమార్ రెండో భాగం రెడీ చేయాలంటే దాదాపు 30 నిమిషాల నిడివి పెంచాల్సి వస్తుందట.. ఈ నేపథ్యంలోనే అనసూయకి కూడా ఒక ఏడు ఎనిమిది నిమిషాల నిడివి పెంచే అవకాశం ఉందని అంటున్నారు.. అనసూయ పాత్రతో పాటు సునీల్ పాత్ర కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలా మొత్తం మీద సుకుమార్ అడిగితే కాదనలేక ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్న అనసూయకు ఇప్పుడు అనూహ్యంగా అదృష్టం కలిసి వచ్చింది.


Click it and Unblock the Notifications











