»   » రామ్ చరణ్ మూవీలో అనసూయ ఐటం సాంగ్?

రామ్ చరణ్ మూవీలో అనసూయ ఐటం సాంగ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘సోగ్గాడే చిన్ని నాయనా' మూవీలో అనసూయ పెర్ఫార్మెన్స్, గ్లామర్ చూసిన తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కోసం అనూయను సంప్రదించినట్లు సమాచారం. స్పెషల్ సాంగ్ తో పాటు కొంత పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అనసూయ ఇంకా దీనికి సైన్ చేయలేదు. ఆమె సైన్ చేసిన వెంటనే అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పదో చిత్రం ఇది. ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో భారీ అంచనాల నడుమ నిర్మించబోతున్న ఈ సినిమాను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపొందించబోతున్నారు. ఈనెల 22నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు. నాజర్, పోసాని కృష్ణ మురళి కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.

Anasuya's item song for Ram Charan movie?

సాంకేతిక నిపుణులు...
సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా
మ్యూజిక్ - హిప్ హాప్ ఆది
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
ఆర్ట్ - నాగేంద్ర
ఎడిటర్ - నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్
కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్
ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్
దర్శకుడు - సురేందర్ రెడ్డి

English summary
If the buzz from film nagar is to be believed Anasua maybe seen in a special song in Mega Power Star Ram Charan's upcoming film, Mega producer Allu Aravind is producing the movie on Geetha Arts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu