»   » యాంకర్ అనసూయ గర్భం దాల్చిందా?

యాంకర్ అనసూయ గర్భం దాల్చిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగానికి సంబంధించి యాంకరింగ్ విభాగంలో రాణిస్తున్న వారిలో ఈ మధ్య బాగా పాపులారిటీ సాధించిన భామ అనసూయ. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బిందాస్, జబర్దస్త్ గేమ్ షోలకు వ్యాఖ్యాతగా, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది.

కాగా...ఇప్పుడు అనసూయ గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అనసూయ ప్రస్తుతం గర్భవతిగా ఉందని, త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని అంటున్నారు. అనసూయపై ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడానికి కొన్ని బలైమన కారణాలు కూడా వినిపిస్తున్నాయి.

 Anchor Anasuya is pregnant?

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'కెవ్వుకేక' మూవీ ఆడియో విడుదల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా సెక్సీగా ముస్తాబై అందరి చూపులు తనవైపే తిప్పుకుంటున్న అనసూయ ఈ వేడుకలో కూడా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

అయితే ఈ ఆడియో వేడుకలో ఆమెను నిశితంగా గమనిస్తే....ఆమె పొట్టభాగం కాస్త ఉబ్బెత్తుగా కనిపించింది. దీంతో ఆమె గర్భం దాల్చిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయం ఆనోటా ఈ నోటా ఇప్పుడు ఫిల్మ్ నగర్ అంతటా చర్చనీయాంశం అయింది. మరి అనసూయ గర్భం దాల్చిందనే వార్తలో నిజం ఎంత? అనే విషయంపై ఆమె స్వయంగా క్లారిటీ ఇస్తే బాగుటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

English summary

 Film Nagar source said that, Popular TV anchor Anasuya is pregnant. She is expecting her second baby in the next few months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu