»   » రామ్ చరణ్ మూవీలో హాట్ యాంకర్ అనసూయ?

రామ్ చరణ్ మూవీలో హాట్ యాంకర్ అనసూయ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకరింగుతో పాటు తన హాట్ యాటిట్యూడ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.... అడపా దడపా సినిమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీలో తనం అందంతో మెస్మరైజ్ చేసిన నాటీ యాంకర్, ఇటీవల విన్నర్ చిత్రంలో స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 'క్షణం' లాంటి సినిమాల్లో సీరియస్ పాత్రలో పెర్పార్మెన్స్ పరంగా కూడా మంచి మార్కులే తేచ్చుకుంది.

అనసూయ పాత్ర ఏమిటి?

అనసూయ పాత్ర ఏమిటి?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో అనసూయ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా ఆమె స్పెషల్ సాంగుకే పరిమితం అవుతుందా? లేక ఏదైనా ప్రధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

సుకుమార్

సుకుమార్

తాజాగా సుకుమార్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ మాస్ లుక్ లీకైంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విలేజ్ కుర్రాడిగా రామ్ చరణ్ మాస్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు.

చరణ్, సమంత

చరణ్, సమంత

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

నిజమా

నిజమా

80ల నాటి పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని...., హీరోకు చెవుడు, హీరోయిన్ మూగ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

స్టోరీ ఇదేనా

స్టోరీ ఇదేనా

హీరో పల్లెటూరి అబ్బాయి. అతడు చెవిటివాడు. అమాయకుడైన పల్లెటూరి యువకుడు పట్నంలో అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడ ప్రయోగశాలతో చేరిన అతడిపై ఓ ప్రయోగం జరుగుతుందట. ఆ తర్వాత హీరో జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ అని టాక్.

విభిన్నమైన కథ

విభిన్నమైన కథ

ఇప్పటికే పలు చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు తీయని ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

English summary
Film Nagar source said that, Anchor Anasuya Bharadwaj is likely to be seen alongside actor Ram Charan in his next film with director Sukumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu