అల్లుఅర్జున్ గురించి అనసూయ అలా అనేసిందేంటి?.. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా?

కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా అడ్రెస్ యాంకర్‌ అనసూయ అనే వాదన ఇండస్ట్రీలో ఉంది. ఆమె సెన్సేషన్ స్టార్ విజయ్‌ దేవరకొండను టార్గెట్‌ చేస్తూ చాలా సార్లు వివాదస్పద కామెంట్లతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. రీసెంట్ గానే ఆ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఆమె ఇప్పుడు అల్లు అర్జున్‌పై ఆమె చేసిన షాకింగ్ అండ్ కాంట్రవర్సీ కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. వివరాళ్లకి వెళితే..

'పుష్ప 2'నే బడా ప్రాజెక్ట్: బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.... ప్రస్తుతం సినిమాల్లో విలక్షణ నటిగా కొనసాగుతోంది. వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. సినిమా సినిమాకు వై‌విధ్యత చూపిస్తూ కెరీర్ లో ముందుకెళ్తోంది. అయితే ఆమె చేస్తున్న సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమా 'పుష్ప 2'. ఈ చిత్రంలో ఆమె దాక్షాయణిగా ఫుల్ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది. పుష్పరాజ్‌పై పగ తీర్చుకునేందుకు రగిలిపోయే ఓ పవర్ పుల్ రోల్ లో కనిపించినుంది.

Anchor Anasuya Shocking Comments on Allu Arjun Old video viral in social media

మెగాఫ్యామిలీ హీరోలతో: అయితే అనసూయ బన్నీతోనే కాకుండా.. మెగాఫ్యామిలీలోని ఇతర బడా హీరోలతోనూ కలిసి నటించింది. 'పుష్ప' కన్నా ముందు.. రామ్‌చరణ్‌తో 'రంగస్థలం' చిత్రంలో నటించింది. రంగమ్మత్తగా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని రంగమ్మత్త పాత్రనే.. అనసూయ కెరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్. వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే చిరంజీవితోనూ కలిసి ఓ యాడ్ లో నటించే ఛాన్స్ ను అందుకుంది.

Anchor Anasuya Shocking Comments on Allu Arjun Old video viral in social media

అల్లు అర్డున్ హీరో ఏంటి: అనసూయ.. గతంలో ఎప్పుడో అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చాయి. దానికి సంబంధించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అనసూయ మాట్లాడుతూ.. 'అల్లు అర్జున్‌ హీరో ఏంటీ? మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా? గంగోత్రి చూసి అసలు మనందరికీ ఏమైంది అని అనిపించింది.. ఓ పాటలో లంగాఓణిలో అల్లుఅర్జున్ ను అస్సలు చూడలేకపోయాను.

కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అతడంటే చెప్పలేనంత పిచ్చి' అంటూ ఆ వీడియోలో చెప్పింది. ఎన్నో ఏళ్ల క్రితం అనసూయ మాట్లాడిన ఈ ఇంటర్వ్యూలో వీడియో క్లిప్‌ ప్రస్తుతం బయటకు వచ్చి చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

అనసూయ నుంచి రాబోయే చిత్రాలు: ఇకపోతే అనసూయ ఇటీవలే 'విమానం' చిత్రంలో వేశ్య పాత్రలో కనిపించి ఆకట్టకుంది. ప్రస్తుతం 'పుష్ప 2' తో పాటు సింబా, తమిళంలో 'వోల్ఫ్‌'.. ఇంకా మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అవన్నీ తర్వలోనే ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. మరి వీటితో అనసూయ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X