అనసూయకు క్రేజీ ఆఫర్లు... సెన్సేషనల్ డైరెక్టర్స్‌, మెగా హీరోలతో

యాంకర్‌గానే కాకుండా నటిగా వెండితెర మీద అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శిస్తున్న అనసూయ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. రంగస్థలం మూవీ తర్వాత అనసూయ‌కు ఉన్న గ్లామర్ ట్యాగ్ పక్కకు తప్పుకొని ఫెర్ఫార్మర్ అనే ముద్ర పడింది. దాంతో అనసూయను భారమైన, ప్రధాన పాత్రల్లో నటింపజేసేందుకు తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా అనసూయ ముందు మంచి క్రేజీ ఆఫర్లు ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

 రంగమ్మత పాత్ర తర్వాత అనసూయ కెరీర్

రంగమ్మత పాత్ర తర్వాత అనసూయ కెరీర్

రంగమ్మత్త తర్వాత అనసూయ కెరీర్ మరో లెవెల్‌కు చేరుకొన్నది. కేవలం గ్లామర్ తారగానే చూసిన సినీ వర్గాలు.. ఆమెలోని నటిని పసిగట్టారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ (F2), యాత్ర చిత్రంలో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడం జరిగింది. అందుకే అనసూయ ముందు ఇంపార్టెంట్ పాత్రలు ఆమెకు ఆఫర్ చేస్తున్నారనే విషయం ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది.

 సింగిల్ ఫెర్ఫార్మర్‌గా అనసూయ

సింగిల్ ఫెర్ఫార్మర్‌గా అనసూయ

ప్రస్తుతం సచ్చిందిరా గొర్రే, కథనం చిత్రాల్లో సోలో ఫెర్హార్మర్‌గా కనిపించబోతున్నారు. తెలంగాణ నేపథ్యంగా తెరకెక్కిన సచ్చిందిరా గొర్రే విడుదలకు ముస్తాబవుతున్నది. అలాగే కథనంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఓ విలక్షణ మైన పాత్రను పోషిస్తున్నది. ఇలా ఫెర్ఫార్మర్‌గా తన ప్రతిభను చాటుకొంటున్న అనసూయను రెండు క్రేజీ ప్రాజెక్టులు దక్కినట్టు తెలిసింది.

అల్లు అర్జున్, సుకుమార్ ప్రాజెక్టులో

అల్లు అర్జున్, సుకుమార్ ప్రాజెక్టులో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో దర్శకుడు సుకుమార్ రూపొందించబోయే తన తదుపతి చిత్రంలో అనసూయకు మరో మంచి పాత్ర దక్కినట్టు తెలిసింది. సినిమాకు బలంగా మారే పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు తగిన రేంజ్‌లో ఉంటుందనే మాట వినిపించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

కొరటాల శివ, చిరంజీవి సినిమాలో

కొరటాల శివ, చిరంజీవి సినిమాలో

ఇక కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే మూవీలోను ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రంలో స్టోరిలో భాగమయ్యే పాత్రను అనసూయకు కొరటాల కేటాయించినట్టు తెలిసింది. కొరటాల చెప్పిన పాత్ర నచ్చడంతో అనసూయ వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. సైరా తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. రాజేష్ ఆనందన్ తెరకెక్కించే అదిరా మచ్చ అనే చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X