Jani Master Case : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. బాధితురాలి వెనుక ఆ హీరో!!

మలయాళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, మహిళలపై వేధింపులకు సంబంధించి హేమ కమిటీ సంచలన నివేదిక వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై మహిళా నటులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలోనూ హేమ కమిటీ వంటి కమీషన్ ఉండాలని సమంత లాంటి స్టార్ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దశలో దక్షిణాదిలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా వెలుగొందుతున్న జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఆ వివరాల్లోకి వెళితే:

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై హైదరాబాద్ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తొలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవ్వగా.. ఘటన జరిగింది నార్సింగి పరిధిలో కావడంతో అక్కడికి బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు. తెలుగులో ఓ టాప్ ఛానెల్‌లో ప్రసారమైన డ్యాన్సింగ్ షో సమయంలో బాధితురాలు జానీ మాస్టర్‌కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు.

Anchor Jhansi Made sensational comments on Choreographer Jani Master case here s the details

ఆ పరిచయం ద్వారానే జానీ మాస్టర్ టీమ్‌లో ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం దక్కింది. ఆ యువతి 2019 నుంచి జానీ మాస్టర్ బృందంలో పనిచేస్తోందని పోలీసులు వెల్లడించారు. ముంబైలోని ఓ హోటల్‌లో జానీ మాస్టర్ ఈమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ విషయం బయటికి పొక్కితే తీవ్ర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను హెచ్చరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఆమెను బలవంతం చేసినట్లుగా ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. తన కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ కూడా రాకుండా చేస్తానని బెదిరించినట్లుగా బాధితురాలు ఆరోపిస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో నా వ్యాన్‌లోకి వచ్చి.. తన ప్యాంట్ జిప్ తీసి నాపై బలాత్కారం చేయబోయినట్లుగా బాధితురాలు పేర్కొంది. తాను తీవ్రంగా ప్రతిఘటించడంతో నా తలను అద్దంకేసి కొట్టాడని , తన ఫ్లాట్‌కు అర్థరాత్రులు వచ్చి.. కోరిక తీర్చమని చాలాసార్లు దాడి చేశాడని ఆరోపించింది.

ప్రస్తుతం జానీ మాస్టర్ కేసులో మరిన్ని ఆధారాలు , వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో జానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మంగళవారం మీడియాతో మాట్లాడింది. యాంకర్, సినీనటి ఝాన్సీ మాట్లాడుతూ.. ఓ పెద్ద హీరో తన మేనేజర్‌ని పంపించి బాధితురాలికి వ్యక్తిగతంగా అండగా నిలిచారని చెప్పింది. ఓ పెద్ద బ్యానర్‌ బాధితురాలికి ఛాన్స్ ఇచ్చిందని .. ఇండస్ట్రీ నుంచి టాలెంట్‌కు సపోర్ట్ ఉంటుందని, ప్రతిభకు గుర్తింపు కూడా దక్కుతుందని ఝాన్సీ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జానీ కేసు బాధితురాలికి అండగా నిలిచిన పెద్ద హీరో ఎవరన్న దానిపై ఫిలింనగర్‌లో డిస్కషన్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X