ఏపీ పొలిటికల్ లీడర్ రిలేషన్‌షిప్.. క్రికెటర్‌తో పెళ్లిపై యాంకర్ ప్రదీప్ క్లారిటీ
టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్, హోస్ట్ ప్రదీప్ మాచిరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నటించిన సినిమా ప్రమోషన్స్‌లో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. అయితే గత కొన్నేళ్లుగా నాకు చాలా మందితో పెళ్లి చేసే ప్రయత్నం చేశారనే విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే పొలిటికల్ లీడర్‌తో తన రిలేషన్‌షిప్ గురించి ఆయన ప్రేక్షకులకు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఆయన తన పెళ్లి గురించి వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో అభిరుచి గల చిత్రాలను నిర్మించడానికి వచ్చిన మాంక్స్ అండ్ మాంకీస్ బ్యానర్‌పై ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జీఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్నీ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శక ద్వయం నితిన్, భరత్ రూపొందించారు.

ట్రైలర్ రిలీజ్ ప్రోమోను ఎమోషనల్‌గా రూపొందించి రిలీజ్ చేశారు. ప్రోమోలో.. తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి, జన్మను ప్రసాదించిన మాతృమూర్తి హస్తాలతో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించాలని అనుకొన్నారు. గృహిణిగా ఉంటున్న తాను కెమెరా ముందుకు రాలేనని చెప్పారు. అయితే తనకు మూడు ప్రశ్నలు వేసి.. దానికి నన్ను ఇంప్రెస్ జవాబులు నువ్వే ఇస్తే..నేను ట్రైలర్ రిలీజ్ చేస్తానని ఆమె అన్నారు. అలా కుస్తీలు పట్టిన ప్రదీప్.. చివరకు ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను పెళ్లి చేసుకొంటానని ఆయన చెప్పారు. దాంతో తల్లి ట్రైలర్ రిలీజ్ చేస్తానని ప్రదీప్ మాచిరాజుకు చెప్పారు.
అయితే యాంకర్, యాక్టర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రస్తావన వస్తే..ముందుగా పెళ్లి ఎప్పుడు? అని అడుగుతారు. దాంతో తాను ఏదో కారణాలు చెప్పి మీడియా నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తారు. అయితే తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ప్రమోషన్స్ గురించి ఆయనపై వస్తున్న పెళ్లి రూమర్ల గురించి మీడియా ప్రశ్నించగా.. నాకు ఎంతమందితో రిలేషన్స్ అంటగడుతారు? అని ప్రశ్నించారు.
నా పెళ్లి గురించి రకరకాల వార్తలు, మీడియాలో వచ్చిన విషయాలు నా దృష్టికి వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలు అని అప్పుడే తేలిపోయాయి. రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారు. అది కాలేదు. ఇప్పుడు క్రికెటర్‌తో నాకు పెళ్లి చేస్తారేమో. అయితే నా పెళ్లి గురించి ఏ వార్త వచ్చినా నమ్మకండి.. అలాంటిది ఏదైతే ఉంటూ నేను స్వయంగా మీతో పంచుకొంటాను అని అన్నారు.
అయితే ఏపీకి చెందిన ఓ పొలిటికల్ లీడర్‌తో పెళ్లి అనే వార్తలో ఎలాంటి నిజం లేదు. అందంతా శుద్ద అబద్ధం. నాకు అలాంటి రిలేషన్‌షిప్ లేదు. అయితే సమయం వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకొంటాను. నాకు ప్రధానంగా ఎలాంటి ప్లాన్ లేదు. లైఫ్‌లో సెటిల్ కావాలని అనుకొన్నాను. నాకు కొన్ని కలలు, లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకొనేందుకు ముందుగా ప్రయత్నిస్తున్నాను అని ప్రదీప్ మాచిరాజు అన్నారు.


Click it and Unblock the Notifications











