లేడీ యాంకర్ ప్రేమలో యాంకర్ ప్రదీప్ .. అతి త్వరలోనే గుడ్ న్యూస్!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అంటే లేడీస్‌నే గుర్తు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు మేల్ హోస్టులు బాగా హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో ప్రదీప్ మాచిరాజు ఒకడు. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడ్డ అతడు.. తనదైన టాలెంట్లను నిరూపించుకుని స్టార్ యాంకర్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతోన్నాడు. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

అలా మొదలై స్టార్ యాంకర్‌గా
తెలుగులో ఇప్పుడు నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోన్న ప్రదీప్ మాచిరాజు.. రేడియో జాకీగా కెరీర్‌ను మొదలుపెట్టాడు. అందులో చాలా కాలం పాటు సత్తా చాటిన తర్వాత యాంకర్‌గా పరిచయం అయ్యాడు. ఆరంభంలోనే 'గడసరి అత్త సొగసరి కోడలు' షోతో పాపులర్ అయ్యాడు. దీంతో నంది అవార్డును కూడా అందుకుని.. అప్పటి నుంచి వరుస షోలతో సత్తా చాటాడు.

Anchor Pradeep Machiraju Romance With Deepika Pilli For His New Movie

అదిరిపోయే టాలెంట్లతో ఫుల్
యాంకరింగ్ రంగంలో ప్రదీప్ మాచిరాజు హవాను చూపించడానికి అతడి టాలెంటే ప్రధాన కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన టైమింగ్‌తో పాటు వాక్చాతుర్యంతో అదరగొట్టే అతడు.. పక్కన ఎంత మంది ఉన్నా ప్రతి కార్యక్రమాన్ని వన్ మ్యాన్ షోగా మార్చుకుంటున్నాడు. తద్వారా వరుసగా షోలు మీద షోలు చేస్తూ హవాను చూపిస్తూనే ఉన్నాడు.

హీరోగా మొదటి చిత్రమే హిట్
ప్రదీప్ మాచిరాజు గతంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఈ నేపథ్యంలో ఇటీలవ హీరోగా మారి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ హిట్ అయింది. ఫలితంగా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ హిట్ చిత్రంలో ప్రదీప్‌కు టాలీవుడ్‌లో హీరోగా అదిరిపోయే ఆరంభం లభించింది.

Anchor Pradeep Machiraju Romance With Deepika Pilli For His New Movie

బుల్లితెరకు బ్రేక్ ఇచ్చేశాడు
తెలుగు బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా సత్తా చాటుతోన్న ప్రదీప్.. వరుసగా షోలు మీద షోలు చేస్తూ వస్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అతడు ఒక్కసారిగా స్లో అయిపోయాడు. అంతేకాదు, ప్రస్తుతం అతడు ఏ ఛానెల్‌లోనూ ఒక్క కార్యక్రమం కూడా హోస్ట్ చేయడం లేదు. దీంతో యాంకర్ ప్రదీప్ మాచిరాజు అభిమానులు నిరాశ చెందుతున్నారు.

గుడ్ న్యూస్ చెబుతాడట
యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు.. సినిమాల్లో హీరోగానూ అదిరిపోయే ఎంట్రీని అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు రెండో చిత్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బుల్లితెరకు అతడు బ్రేక్ కూడా ఇచ్చాడని అంటున్నారు. ఇక, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని సమాచారం.

Anchor Pradeep Machiraju Romance With Deepika Pilli For His New Movie

దీపిక పిల్లి ప్రేమలో ప్రదీప్
ప్రదీప్ మాచిరాజు రెండో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో యాంకర్ దీపిక పిల్లి హీరోయిన్‌గా నటిస్తుందట. ఇప్పటికే దీనిపై చర్చలు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే బుల్లితెరపై వీళ్లిద్దరి అభిమానులకు ఫుల్ హ్యాపీ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X