పెళ్లికి సిద్ధమవుతున్న యాంకర్ ప్రదీప్.. ఆ అమ్మాయి ఎవరంటే..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లికి సంబంధించిన వార్తలు చాలానే వస్తున్నాయి. ఇప్పటికే బ్యాచిలర్ లైఫ్ కి చాలా మంది హీరోలు ఎండ్ కార్డ్ పెట్టేశారు. గత ఏడాది వరకు పెళ్లి అంటేనే పారిపోయేలా స్టైల్ కొట్టిన హీరోలు కూడా మనసుకు నచ్చిన అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పెళ్లి బోజనాలు పెట్టించేశారు. ఇక మెల్లగా యాంకర్ ప్రదీప్ కూడా త్వరలోనే గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడానికి పేద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది.

ఆ లిస్టులో ప్రదీప్ కూడా ఉన్నాడు

ఆ లిస్టులో ప్రదీప్ కూడా ఉన్నాడు

సమ్మర్ లో యువ కథానాయకులు నితిన్, నిఖిల్, రానా ఒక ఇంటివారైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో ఫ్రీ టైమ్ దొరకడంతో పెద్దగా టెన్షన్స్ లేకుండా కూల్ గా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి మరికొంత మంది హీరోలు కూడా చేరే అవకాశం ఉన్నట్లు రూమర్స్ బాగానే వస్తున్నాయి. అందులో ప్రదీప్ కూడా ఉన్నాడు. 33 ఏళ్ళ వయసులో ఉన్న ఈ సీనియర్ యాంకర్ మొత్తానికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వస్తోంది.

ప్రదీప్ పెళ్లి వార్త.. నిజమేనా?

ప్రదీప్ పెళ్లి వార్త.. నిజమేనా?

అయితే ఇలాంటి రూమర్స్ మనోడికి కొత్తేమి కాదు. గతంలో పెళ్లికి సంబంధించిన వార్తలు చాలా సార్లు హాట్ టాపిక్ గా నిలిచాయి. ప్రదీప్ కూడా వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు మాత్రం ఈ రూమర్స్ నిజం కాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా కొత్త తరహా వార్తలు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కూతురు ఎవరంటే..

పెళ్లి కూతురు ఎవరంటే..

పెళ్లికి సంబంధించిన చర్చలు ఎంతవరకు జరిగాయో తెలియదు గాని ఆల్ మోస్ట్ పెళ్లి కుతురు ఫిక్స్ అయ్యిందట. ఆమె ఒక బడా రాజకీయ నేత కూతురని రకరకాల కథనాలు కూడా పూట్టుకొస్తున్నాయి. ప్రదీప్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యుల గత ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ మనోడు కెరీర్ లో ఇంకా ఏదో సాధించాలనే తపనతో అలాంటి బాధ్యతలను అప్పుడే తీసుకోవద్దని వెయిట్ చేస్తున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Devi Nagavalli Re Entry? !ప్రేక్షకుల డిమాండ్!! | Filmibeat Telugu
ఎలాగైనా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని..

ఎలాగైనా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని..

ప్రదీప్ 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు సిద్దమైన సమయంలో సడన్ గా లాక్ డౌన్ స్టార్ట్ కావడంతో సినిమా వాయిదా పడింది. ఎలాగైనా ఆ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పైగా సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం వస్తున్న పెళ్లి వార్తలపై ప్రదీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X