రష్మీకి బంపర్ ఆఫర్.. ఏకంగా ఆయన సినిమాలో ఛాన్స్.. ఆ పరిచయంతోనే?

తెలుగువారిలో యాంకర్ రష్మీ అంటే తెలియని వారు ఉండరేమో ?. ఈ భామ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులలో అంతగా పేరు సంపాదించింది. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, డీ షో లు చేస్తోంది. ఇవి కాకుండా ఈ టీవీ చేసే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ భామ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉండేది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి లక్ పరీక్షించుకుంది. అయితే ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మికి ఒక బంపర్ ఆఫర్ తగిలినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

అందాలు ఆరబోసినా వర్కౌట్ కాలేదు

అందాలు ఆరబోసినా వర్కౌట్ కాలేదు

నిజానికి రష్మీ వెండితెర మీద నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కంటే గ్లామర్ షో, అందాల ఆరబోతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అలాంటి పాత్రలు ఎంచుకుంది. బహుశా అలాంటి పాత్రలు చేస్తే మరింత క్రేజ్ లభిస్తుందని భావించేది ఏమో, కానీ ఆమె ఎంత అందాలు ఆరబోసినా సరే ప్రేక్షకులు బుల్లితెర మీద ఆదరించిన అంత బాగా వెండితెర మీద ఆదరించలేదు.. సినిమాల్లో ఈ భామకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఫలితం కూడా దక్కలేదు.

సోషల్ మీడియాలో యమా క్రేజ్

సోషల్ మీడియాలో యమా క్రేజ్

కానీ ఈ భామ బుల్లితెర మీద కనిపిస్తే మాత్రం ప్రేక్షకులు పట్టం కట్టేశారు. ఆమె ఉన్న అన్ని వీడియోలు, ఆమె చేస్తున్న అన్ని షోలకు మంచి టి ఆర్ పి లు వస్తూ ఉంటాయి. అదేమి చిత్రమో ఈ భామకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కేవలం తన హాట్ హాట్ ఫోటోలు అప్లోడ్ చేయడమే కాక తనలోని సామాజిక కోణాన్ని కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ ఉంటుంది. అలా ఈ భామకు సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది.

 లక్కీ ఛాన్స్

లక్కీ ఛాన్స్

అందుతున్న సమాచారం మేరకు ఈ భామకు ఒక లక్కీ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాగా ఒక షెడ్యూల్ గోవాలో పూర్తయింది. తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరపాలని ప్లాన్ చేసినా కరోనా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతానికి జరపడం లేదు.

ఆ పరిచయంతోనే

ఆ పరిచయంతోనే


ఈ సినిమాలో రష్మికి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఆమె నటిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో ఈ భామ ప్రవీణ్ సత్తారుతో కలిసి గుంటూరు టాకీస్ అనే సినిమా చేసింది.. అప్పటి పరిచయం నేపథ్యంలో ఈ సినిమాలో పాత్రకు రష్మీ కరెక్ట్ గా సరిపోతుందని భావించి దర్శకుడు ఆమెకు ఈ అవకాశం ఇచ్చాడని అంటున్నారు.

Recommended Video

Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
 బంపర్ ఆఫర్

బంపర్ ఆఫర్

ఇక సినిమా అవకాశాలు సరిగా రావడం లేదని భావిస్తూ బుల్లితెర కే పరిమితం అయిపోవాలని ఫిక్సయిన రష్మీకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఈ సినిమా గనుక హిట్ అయితే ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. చూడాలి మరి ఏమవుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X