Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వాడుకోవాలనుకొన్నారు.. కానీ శ్రీముఖి హ్యాండిచ్చిందట.. పాపం బాబు..?
హిందీలో ఘన విజయం సాధించిన హంటర్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అశ్లీల సన్నివేశాలు అతిగా ఉన్నాయని, మితిమీరిన శృంగారం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్లో 'బాబు బాగా బిజీ' సినిమాపై జరిగిన చర్చ ఇటీవల కాలంలో ఈ చిత్రపైనా కూడా జరుగలేదు. హిందీలో ఘన విజయం సాధించిన హంటర్ చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అశ్లీల సన్నివేశాలు అతిగా ఉన్నాయని, మితిమీరిన శృంగారం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న బాబు బాగా బిజీ సినిమాలో అవసరాల శ్రీనివాస్, శ్రీముఖి, తేజస్వి తదితరులు నటించారు. ఈ చిత్రం మే 5వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.
ప్రమోషన్‌కు హ్యాండ్..
ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు, రూమర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్‌కు యాంకర్ శ్రీముఖి దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ప్రమోషన్ కొసం ఇతర హీరోయిన్లతోపాటు ఫొటోషూట్ చేయాలని చిత్ర నిర్మాతలు శ్రీముఖిని సంపద్రించారట. సినిమా ప్రచారం కోసం ఉపయోగపడేలా సహకరించాలని వారు కోరారట. అయితే కార్యక్రమానికి చెప్పపెట్టకుండా శ్రీముఖి హాజరుకాకపోవడంపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
శ్రీముఖిని వాడుకోవాలనుకోవాలన్నారు..
ఈ సినిమాలో శ్రీముఖితోపాటు తేజస్వి, సుప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిగితా వారితో పోల్చుకుంటే శ్రీముఖి క్రేజ్ ఎక్కువ.అందుకే ప్రమోషన్, ప్రచార పోస్టర్లకు శ్రీముఖిని వాడుకోవాలని భావించారు చిత్ర నిర్మాతలు. అయితే తీరా సమయానికి తనకు సమయం లేదని, ఇతర కార్యక్రమాల్లో బిజీ అని చెప్పి హ్యాండించినట్టు తెలుస్తున్నది.
ఉన్నంతలోనే..
శ్రీముఖి హ్యాండివ్వడంతో చేసేది ఏమీ లేక ఇతర హీరోయిన్లను ప్రయోషన్కు ఉపయోగించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా తమ వద్ద ఉన్న స్టిల్స్‌తోనే శ్రీముఖిని ప్రమోషన్‌కు వాడుకోవాలని చూస్తున్నారట.
షాక్ తిన్న సెన్సార్ అధికారులు..
ఇటీవల బాబు బాగా బిజీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్లు షాక్ గురయ్యారట. సినిమాలో కొన్ని సీన్లు చూడలేక మహిళా అధికారులు బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. తొలుత ఈ చిత్రంపై సెన్సార్ అధికారులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా దర్శకుడు నవీన్ నిరసన వ్యక్తం చేశారట. హిందీ సినిమా హంటర్‌కు లేని అభ్యంతరాలు ఈ సినిమాకు ఎందుకు అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే కొన్ని అభ్యంతరాలతో సెన్సార్ సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.