యాంకర్ ఉదయభాను కొత్త యాంగిల్.. అనసూయకు గట్టిపోటీగా!

బుల్లితెరపై తమ మాటలతో ఎంటర్టైన్ చేసి, సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన వారెందరో ఉన్నారు. ఆ జాబితాలో యాంకర్ ఝాన్సీ, అనసూయ, శ్రీముఖి, సుమ అలాంటి స్టార్ యాంకర్స్ ఉన్నారు. వారు బుల్లితెరపై తమ యాంకరింగ్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుని.. సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీ, అనసూయ లు పూర్తిగా తమ యాంకరింగ్ కు స్వస్తి చెప్పి, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీ అయిపోయారు. ఈ జాబితాలో మరో స్టార్ యాంకర్ చేరబోతుంది. బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇంతకీ ఆ టాప్ యాంకర్ ఎవరు? ఆ స్టోరీ ఏంటో ఓ లూక్కేయండి.

ఆ బుల్లితెర స్టార్ అండ్ టాప్ యాంకరమ్మ ఎవరో కాదు.. సీనియర్ యాంకర్ ఉదయభాను. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వాస్తవానికి ఉదయభాను తొలుత పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి చేతుల మీదుగా సినిమా లోకి అడుగు పెట్టింది. అలా 'ఎర్రసైన్యం' సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించిన ఉదయభాను. తర్వాత 'కొండవీటి సింహాసనం', 'ఖైదీ బ్రదర్స్', 'శ్రావణమాసం' వంటి పలు సినిమాలతో తోపాటు పలు కన్నడ తమిళ సినిమాలలో నటించింది ఉదయభాను.

Anchor Udaya Bhanu will set as a villain in Sathyaraj- Srivatsa upcoming film Barbarik

అయితే ఊహించని విధంగా అవకాశాలు రాకపోవడం, ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోకపోవడంతో యాంకర్ గా తన ప్రయాణాన్ని కొనసాగించింది ఉదయభాను. అలా ఈటీవీలో ప్రసారమైన 'హృదయాంజలి' ప్రోగ్రాం తో తెలుగు ప్రేక్షకుల కు దగ్గర అయింది. ఈ షో తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఉదయభాను ఆ తరువాత జెమినీ టీవీలో వచ్చిన 'వన్స్ మోర్ ప్లీజ్' అనే కార్యక్రమంలో యాంకర్ గా చేసింది. ఇక ఈ కార్యక్రమం తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఉదయభాను. ఈ షో ద్వారా ఉదయభానుకి ఎనలేని పాపులార్టీ వచ్చింది.

ఒకానొక సమయంలో యాంకర్ అంటే ఉదయభాను.. ఉదయభాను అంటే యాంకర్ అనే విధంగా ఫేమస్ అయ్యింది. అసలు ఏమైందో తెలియదు. కానీ, అటు వెండితెరకు.. ఇటు బుల్లితెరకు.. రెండింటికి దూరమైంది ఉదయభాను. తర్వాత మిద్దె విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. ఆ తర్వాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అలా రానా దగ్గుపాటి లీడర్ సినిమాలో, అల్లు అర్జున్ జులాయి సినిమాలో స్పెషల్ సాంగ్ లలో మాస్ టెంపుల్ వేసి అలరించింది.

ఆ తర్వాత 2013లో భానుమతి అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, అనుకున్న స్థాయిలో విజయం దక్కకపోవడంతో సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది. గత ఏడాది రానా రోహిత్ హీరోగా తెరకెక్కిన 'ప్రతినిధి 2' సినిమాలో కనిపించి మెప్పించింది.
తాజాగా మరోసారి రీఎంట్రీ కి ఉదయభాను సిద్ధమైందట. గ్లామర్ పాత్రలో కాకుండా పాత్రలో కనిపించబోతుందట. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న బార్బీరిక్ అనే సినిమా విలన్ పాత్రలో నటించబోతుందట.

Anchor Udaya Bhanu will set as a villain in Sathyaraj- Srivatsa upcoming film Barbarik

ఈ సినిమాకు మోహన్ శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పాన్ ఇండియా సినిమాలో ఉదయభాను విలన్ పాత్రలో కనిపించ పోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో ఉదయభాను ఇమేజ్ పూర్తిగా మారిపోబోతుందని సినిమా లవర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉదయభాను పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సింది. ఒకవేళ ఉదయభాను రీఎంట్రీలో సక్సెస్ అయితే.. మాత్రం అనసూయను ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని మూవీ లవర్స్ భావిస్తున్నారు. మరీ 'బార్బరిక్' సినిమాతో ఉదయభాను కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: sathyaraj udaya bhanu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X