For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Varshini Sounderajan:త్వరలో పెళ్లి చేసుకోనున్న యాంకర్ వర్షిణి.. వరుడు అతడేనట!

  |

  వర్షిణి సౌందరాజన్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేనిపేరు. ఎందుకంటే అంతలా ఈ ముద్దుగుమ్మ చాలా కాలం తనదైన అందం, యాంకరింగ్ తో ఆకట్టుకుంది. తన యాంకరింగ్, అందానికి యూత్ ఫిదా అయింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో టీవీలో షోల కంటే సినిమాలు చేసేందుకే ఎక్కవ ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు అంతగా ఫలించలేదని సమాచారం. ఇక సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుంటే పోలా.. అని అనుకుందట ఈ బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి.

  ముందుగా మోడలింగ్ లోకి..

  ముందుగా మోడలింగ్ లోకి..

  నటిగా పరిచయం అవడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు లాగేసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును అందుకుంది.

  'చందమామ కథలు' ద్వారా..

  'చందమామ కథలు' ద్వారా..

  మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే వర్షిణి 'చందమామ కథలు' అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ ఇవ్వలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌ చేసి మంచి బ్రేక్‌ను దక్కించుకుంది.

  కావాల్సిన గుర్తింపు రాలేదు..

  కావాల్సిన గుర్తింపు రాలేదు..

  సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా వర్షిణి సౌందరాజన్ కు కావాల్సిన గుర్తింపు రాలేదు. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ బ్యూటీ బుల్లితెరపైకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే 'ఢీ' షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా పని చేసింది. అందులో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత యాంకర్‌గా మారి 'పటాస్' సహా కొన్ని షోలు హోస్ట్ చేసింది.

  సుదీర్ఘ ప్రయాణంలో..

  సుదీర్ఘ ప్రయాణంలో..

  సుదీర్ఘ ప్రయాణంలో చాలా షోలను హోస్ట్ చేసిన వర్షిణి.. ఆ మధ్య స్టార్ మాలో ప్రసారం అయిన 'కామెడీ స్టార్స్' షోకు యాంకర్‌గా చేసింది. దీని తర్వాత ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. అయితే, సమంత నటిస్తోన్న 'శాకుంతలం', సుమంత్ 'మళ్లీ మొదలైంది' వంటి సినిమాలు చేసింది. మళ్లీ మొదలైంది మూవీలో చేసిన ఆమెకు అంతగా ఒరిగింది లేదు.

  ఆది, వర్షిణి మధ్య ప్రేమ వ్యవహారం..

  ఆది, వర్షిణి మధ్య ప్రేమ వ్యవహారం..

  ఇదిలా ఉంటే ఆ మధ్య ఆది, వర్షిణి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ ఇలా ఎన్నెన్నో రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ ఉట్టి గాలి వార్తలేనని కొట్టిపారేస్తుంటారు ఆది వర్షిణి. తామిద్దరం మంచి స్నేహితులమని ఎన్నో సార్లు క్లారిటీగా చెప్పుకొచ్చారు.

  మరోసారి వర్షిణి పెళ్లి వార్తలు..

  మరోసారి వర్షిణి పెళ్లి వార్తలు..

  ఇక ఇప్పుడు మరోసారి వర్షిణి పెళ్లి వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. బుల్లితెరకు గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాల్లో ప్రయత్నించిన వర్షిణికి అంతగా అవకాశాలు రాలేదట. దీంతో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని వర్షిణి డిసైడ్ అయిందట. అయితే ఇప్పుడు వర్షిణి పెళ్లి టాపిక్ తోపాటు ఆమె చేసుకోబోయేవారు ఎవరు అని ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.

  తన బావతో వివాహం..

  తన బావతో వివాహం..


  యాంకర్ గా అదరొగట్టిన వర్షిణి సౌందరరాజన్ తన బావను వివాహం చేసుకోనుందట. వరసకు బావ అయ్యే అతనంటే వర్షిణికి చాలా ఇష్టమని, ఆమె అన్నా అతనికి కూడా ఎంతో ఇష్టమని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకుంటున్నారని సమాచారం.

  ఈ నెల చివర్లో ఎంగేజ్ మెంట్..

  ఈ నెల చివర్లో ఎంగేజ్ మెంట్..


  సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా తన బావతో ఈ నెల చివర్లో ఎంగేజ్ మెంట్ చేసుకోనుందట వర్షిణి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం మార్చిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే వీరిద్దరి నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బుల్లితెరకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా తన అందాలను వడ్డిస్తూ తన నుంచి అటెన్షన్ పోకుండా చేస్తూంది ఈ హాట్ యాంకర్.

  English summary
  Anchor Varshini Sounderajan Is Going To Married A Software Employee Rumors Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X