నితిన్ మూవీలో అనసూయ.. పవర్‌ఫుల్ ప్లాన్ చేసిన యూనిట్

ఈ ఏడాది మంచి జోష్ కొనసాగించడం ఖాయం అంటూ భీష్మ ద్వారా హింట్ ఇచ్చేశాడు నితిన్. ఓ వైపు తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంటేనే మరోవైపు 2020 బెస్ట్ హిట్స్ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. భీష్మ సినిమాతో 2020 సంవత్సరానికి శుభారంభం చేసిన నితిన్.. ఇటీవలే బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌గా మూవీ అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటించేందుకు ఓకే చెప్పాడు. నిన్న (సోమవారం) ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు.

ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. జూన్ నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు నేటివిటీకి తగినట్టు అంధాదున్ మూవీ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం.

Andhadhun telugu Remake: Anasuya Bharadwaj Role

హిందీ సినిమా అంధాదున్ లో 'టబు' చాలా కీలకమైన పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టడమే గాక సినిమా విజయంలో కీలకం అయింది. అయితే తెలుగులో ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ కథానాయికలను పరిశీలించిన చిత్రయూనిట్.. చివరకు అనసూయను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్త లాంటి పవర్‌ఫుల్ రోల్ పోషించింది కాబట్టి.. అనసూయ అయితేనే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. చూడాలి మరి అనసూయ ఈ సారి ఎలా అలరిస్తుందనేది.

.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X