ఆంధ్రా కింగ్‌ తాలూకాకి రామ్ పోతినేని‌ రెమ్యునరేషన్‌లో ట్విస్ట్? మైత్రీ డీల్‌లో ఏం జరిగిందంటే?

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అయితే ఆయన హిట్ కొట్టి చాలాకాలమే అవుతుండటంతో రామ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌తో చివరిసారిగా విజయం అందుకున్నారు రాపో. ఆ తర్వాత చేసిన రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో ఆయన కెరీర్‌పై ప్రభావం చూపింది. దాంతో రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా విజయం సాధించాల్సిన దశలో రామ్ పోతినేని నటించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. ఈ సినిమాకు ఆయన పారితోషికం ఎంత? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఆంధ్రా కింగ్ తాలూకా తారాగణం
మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఈ ఆంధ్రా తాలూకా సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్‌ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Andhra King Taluka Is Ram Pothineni s Remuneration Deal In Trouble

ఆంధ్రా కింగ్ తాలూకా బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ఇతర వ్యయాలతో కలిపి ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి 70 కోట్ల వరకు ఖర్చు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో రామ్ ముందు భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల గ్రాస్.. 60 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

రామ్ రెమ్యునరేషన్ ఎంత?
అయితే బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోవడంతో రామ్ పోతినేని రెమ్యునరేషన్‌పై ఎఫెక్ట్ పడినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. తొలుత రామ్‌ పోతినేని రెమ్యునరేషన్ కింద 30 కోట్ల వరకు డిమాండ్ చేశారని.. అయితే తర్వాత జరిగిన పరిణామాలు, బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ తదితర అంశాలతో రికవరీని దృష్టిలో పెట్టుకుని పారితోషికం తగ్గించుకోవాలని రామ్‌పై నిర్మాతలు ఒత్తిడి చేసినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. ఫిలింనగర్‌లో వినిపిస్తున్న వార్తలను బట్టి రామ్‌ తన రెమ్యునరేషన్‌ను దాదాపు18 కోట్ల వరకు తగ్గించుకోవాలని ప్రెజర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

రామ్ రెమ్యునరేషన్ డీల్‌లో మార్పులు?
మరో వెర్షన్ ప్రకారం.. రామ్ పోతినేని ఈ సినిమాకు పారితోషికం కింద నైజాం, ఉమ్మడి గుంటూరు జిల్లాల థియేట్రికల్ రైట్స్‌ను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం సినిమా థియేట్రికల్ రన్‌ను బట్టి రామ్‌ లాభాల్లో వాటా తీసుకోవచ్చు. మరి రామ్ పోతినేని రెమ్యునరేషన్ కింద ఎంత తీసుకున్నారు? నిజంగానే నిర్మాతలు ఆయనపై ఒత్తిడి తెచ్చారా? నైజాం, గుంటూరు ఏరియాల థియేట్రికల్ రైట్స్‌నే రామ్ తీసుకున్నారా? ఈ ఊహాగానాలకు చెక్ పడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X