Just In
- 10 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 10 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 11 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
- 12 hrs ago
సెక్స్ అంటే చాలా ఇష్టం.. నాకు నచ్చిన వాళ్లతో తిరుగుతాను: యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
Don't Miss!
- Finance
బద్ధకం ఖరీదు... రూ 42,69,00,000
- News
ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్: 40 శాతం బకాయిలు విడుదల: విలీనంపైన నేడు కీలక నిర్ణయం..!
- Lifestyle
బుధవారం మీ రాశిఫలాలు 11-12-2019
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
బన్నీ - సుకుమార్ సినిమాకు ఏపీ అధికారుల షాక్.. అందుకే అలా వెళ్తున్నారా.!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది షూటింగ్ జరుగుతుండగానే.. సుకుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే, తాజాగా ఈ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికారులు వ్యవహరించిన తీరు గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందట. ఇంతకీ వాళ్లేమన్నారు..? వివరాల్లోకి వెళ్తే..

దీని కోసం అది ఆపేశాడు
వాస్తవానికి బన్నీ.. ‘అల.. వైకుంఠపురములో' తర్వాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ‘ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్' అనే సినిమాను చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాను ఆపుకుని మరీ సుకుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అందరిలో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ సినిమా నేపథ్యం ఇదే
కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బన్నీ - సుకుమార్ సినిమా కథ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అడవులలో ఎర్ర చందనం గ్యాంగులు సాగించే అకృత్యాలు, నేర చరిత ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో బన్నీని కూడా స్మగ్లర్‌గానే చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

మొత్తం అక్కడ తీయాలనుకున్నారు
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీని షూటింగ్ మొత్తం శేషాచలం అడవుల్లోనే తీయాలని అనుకున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుండడంతో పాటు ఆ చెట్లు కూడా ఎక్కువగా విస్తరించి ఉండడంతోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.

ఏపీ అధికారులు షాకిచ్చారు
ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ అధికారులు బన్నీ - సుకుమార్ సినిమాకు షాక్ ఇచ్చారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. శేషాచలం అడవుల్లో షూటింగ్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో అక్కడి అధికారులు పర్మీషన్ ఇవ్వలేదట. చిత్ర బృందం పలుమార్లు వారిని సంప్రదించినప్పటికీ ఎటువంటి స్పందన లేదని టాక్ వినిపిస్తోంది.

అందుకే అలా వెళ్లిపోతున్నారు
శేషాచలం అడవుల్లో షూటింగ్‌కు అడ్డంకులు ఏర్పడడంతో ఈ చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ వెళ్లిపోతోందని తెలుస్తోంది. శేషాచలం అడవులను పోలినట్లు ఉండే థాయ్‌లాండ్ వాతావరణంలో ఈ సినిమా పూర్తి షూటింగ్ జరపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘అల.. వైకుంఠపురములో' షూటింగ్ అయిన వెంటనే చిత్ర యూనిట్ థాయ్ వెళ్తుందని టాక్.

బన్నీ ఆశలన్నీ దీనిపైనే
‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న సినిమానే ‘అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.