సునీల్ ప్రక్కన హీరోయిన్ గా ఆ సింగర్
హైదరాబాద్: బొమ్మరిల్లు చిత్రంలో వుయ్ హావ్ ఎ రోమియో పాట, రాఖీ చిత్రంలో జర జర పాట గుర్తుండే ఉంటాయి. ఆ పాటలు పాడిన సింగర్ ఆండ్రియా జెర్మియా ఇప్పుడు సునీల్ ప్రక్కన హీరోయిన్ గా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళ వెట్టై రీమేక్ గా రూపొందనున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన హన్సిక ఇప్పుటికే సెట్ అయ్యింది. బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తమిళంలో లింగు స్వామి దర్శకత్వంలో రూపొంది హిట్టైన 'వెట్టై'చిత్రాన్ని ఈ ఇద్దరు హీరోలతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యు.టీవి వారి వద్దనుంచి బెల్లంకొండ రైట్స్ తీసుకున్నారు. మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన 'వెట్టై' మంచి విజయం సాధించింది. తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీని ఎన్నుకున్నారు.
కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. నాగచైతన్య ...తమ్ముడుగా కీ క్యారెక్టర్ ని చేస్తూండగా,సునీల్ ..సెకండ్ హీరో పాత్రను చేస్తున్నారు. తమిళంలో ఆర్య..పాత్రను నాగచైతన్య,మాధవన్ పాత్రను సునీల్ చేస్తున్నారు. ఆటోనగర్ సూర్య చేస్తున్న నాగచైతన్య కు తదుపరి చిత్రం ఇదే. ఇక సునీల్ ఇప్పటికే మాధవన్ నటించిన తను వెడ్స్ మను రీమేక్ లో చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ, బ్లేడ్ బాబ్జీ చిత్రాలు చేసిన దేవి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని మొదట తెలుగులో 'భలే తమ్ముడు'గా అనువదించటానికి ప్రయత్నాలు చేసారు. మాధవన్-ఆర్యలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్కడ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని ఆశించారు.అందులోనూ గతంలో వచ్చిన 'రన్', 'పందెం కోడి', 'ఆవారా' చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగు స్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావటంతో క్రేజ్ వచ్చింది. అయితే తెలుగులో డబ్ చేయటం కన్నా రీమేక్ చేస్తేనే ఫలితాలు బాగుంటాయని బెల్లంకొండ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక వెట్టై చిత్రం యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్ సమాహారంతో రూపొందింది. ఈ చిత్రంలో మాధవన్, ఆర్య నటన, సమీరారెడ్డి, అమలాపాల్ అందచందాలు, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే యువన్ సంగీతం పెద్ద ఎస్సెట్ అయింది. ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలోనే హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ కి షాహిద్‌కపూర్ హీరోగా నటించనున్నారు. ఇతర నటీనటుల సంగతి తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











