సీనియర్ హీరో సలహాతో.. యువ హీరోను పట్టేసిన అనిల్ రావిపూడి

లాక్ డౌన్ వల్ల చాలా మంది సినిమా టెక్నీషియన్స్ కి పనిలేక కొంత బోర్ కొట్టేసింది. అయితే ఈ గ్యాప్ ని కొందరు దర్శకులు చాలా బాగా ఉపయోగించుకున్నారు. కొత్త తరహా సినిమాలను చూస్తూ మరింత కొత్తగా కథలను కూడా రాసుకున్నారు. ఇక అనిల్ రావిపూడి కూడా అదే తరహాలో ఒక అద్భుతమైన కథలు రాసుకున్నట్లు తెలుస్తోంది. నిమిషాల్లో సినిమా కోసం కి అవసరమైన సీన్స్ రాయగల అనిల్ ఈ ఆరు నెలల సమయంలో ఎన్ని కథలు రెడీ చేసి ఉంటాడో అనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే గ్యాప్ లేకుండా కొంతమంది దర్శకులు వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఇక అనిల్ కూడా ఇప్పటికే F3ని సెట్స్ పైకి తీలుకురావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. రేపో మాపో ఎనౌన్స్మెంట్ వస్తుంది. ఇక నాగచైతన్యను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య కూడా గ్యాప్ లేకుండా వెంటవెంటనే భవిష్యత్తు ప్రాజెక్టులపై చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక అనిల్ నుంచి ఒక లైన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Anil ravipudi another projects discussion with young hero

ఆ ప్రాజెక్ట్ వెనుక వెంకటేష్ ఉన్నట్లు ఒక రూమర్ అయితే వస్తోంది. వెంకీమామ సినిమాతో చైతూకి సరైన సక్సెస్ అందలేదు. దీంతో వెంకీ సలహా మేరకు చైతూ కోసం ఒక మంచి కథ రెడీ చేయలని అనిల్ రావిపూడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న చైతూ ఆ తరువాత విక్రమ్ కుమార్ సినిమాను సెట్స్ పైకి తెనున్నాడు. ఇక ఇంతలో F3 పూర్తచేసే అనిల్ ఆ తరువాత వెంటనే చైతూతో కలిసి కొత్త సినిమాను స్టార్ట్ చేయవచ్చని టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X