కరోనా తగ్గే వరకు ఆ సినిమా చేయనంటున్న వెంకీ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మెల్లమెల్లగా షూటింగ్స్ మోదలవుతున్నాయి. అయితే మునుపటి రోజుల్లా షూటింగ్ లొకేషన్స్ హడావుడిగా మాత్రం కనిపించడం లేదు. మనిషి మనిషికి చాలా దూరం పెరుగుతొంది. కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికి షూటింగ్స్ ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ముందుకు సాగుతున్నారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్ అయితే కొత్త సినిమాలను స్టార్ట్ చేయాలంటే కొంచెం ఆందోళన చెందుతున్నాడట. లాక్ డౌన్ అనంతరం ఎలాగైనా షూటింగ్ స్టార్ట్ చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి F3 కథను సిద్ధం చేస్తే.. వెంకటేష్ ఆ సినిమా ఇప్పుడు చేయలేనని చెప్పాడట. అందుకు కరోనా ఒక కారణం అయితే రానా పెళ్లి కూడా దగ్గరకొస్తోంది. అలాగే నారప్ప షూటింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది.

మరికొన్ని రోజులు గ్యాప్ లేకుండా పని చేస్తే నారప్ప షూటింగ్ ఎండ్ అవుతుంది. దీంతో వెంకటేష్ మరో పని పెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఇక ఇప్పట్లో F3 ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికి అనిల్ కి ప్రస్తుతం స్టార్ హీరోల డేట్స్ దొరకడం లేదు. పోనీ వెంకీతో అయినా F3 స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఆయన కొన్నాళ్ళు ఆగాల్సిందే అని చెప్పడంలో దర్శకుడు సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











