twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK108: బాలయ్య కోసం పవర్‌ఫుల్ టైటిల్.. అసలైందే ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి

    |

    దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో బడా హీరోగా వెలుగొందుతూ ప్రభావాన్ని చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. హీరోగా ఎంటరైన చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి యాక్టింగ్‌తో సందడి చేసిన ఆయన.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా పెంచుకుని సత్తా చాటారు. ఇలా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అయితే, ఆ మధ్య చాలా సినిమాలు పరాజయం పాలవడంతో బాలయ్య ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'అఖండ'తో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

    బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందుబోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

    'అఖండ' ఇచ్చిన ఊపుతో ఉన్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితోనూ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేసిన్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించాడు.

    Anil Ravipudi Fix Ramarao Garu Title for Balakrishna Movie

    నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాకు గతంలో అనుకున్న విధంగానే 'రామారావు గారు' అనే టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు తెలిసింది. వాస్తవానికి దీనికి 'Bro I Don't Care' అనే టైటిల్ పెడదామని అనుకున్నా.. తెలుగు టైటిల్ అయితేనే బాగుంటుందని యూనిట్ భావించిందట. దీంతో బాలయ్య సలహా మేరకు 'రామారావు గారు' టైటిల్‌నే అనిల్ ఫైనల్ చేశాడని తెలిసింది.

    Bigg Boss Telugu 6: బాత్రూంలోనే ఆ కంటెస్టెంట్.. రిక్వెస్ట్ చేసినా వదలకుండా.. షాకిచ్చిన నాగార్జునBigg Boss Telugu 6: బాత్రూంలోనే ఆ కంటెస్టెంట్.. రిక్వెస్ట్ చేసినా వదలకుండా.. షాకిచ్చిన నాగార్జున

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూవీలో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

    English summary
    Nandamuri Balakrishna Will Do a Movie Under Anil Ravipudi Direction. Ramarao Garu Title Fix For This Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X