ఎఫ్2 సీక్వెల్.. వారిద్దరితో పాటు మరో మాస్ హీరో.. ఇక నవ్వులకు కొదవే ఉండదట!
అనిల్ రావిపూడి చిత్రాలంటే కమర్షియల్ పరంగా హిట్స్ అన్న ముద్ర పడింది. ఆయన కామెడీ టైమింగ్, టేకింగ్ యంగ్ దర్శకులందరిలో ప్రత్యేకంగా ఉంటుంది. మొదటి చిత్రం పటాస్ నుంచి.. రీసెంట్‌గా వచ్చిన సరిలేరు నీకెవ్వరులో కూడా కామెడీ ట్రాక్‌కు పెద్ద పీఠ వేస్తూ వచ్చాడు. ఏ కథ రాసుకున్నా.. అందులో తనదైన శైలి హాస్యం ఉండాల్సిందే. గతేడాది సంక్రాంతి సీజన్‌లో ఎఫ్2 అనే సినిమాను తీసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు.

భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి..
ఎఫ్2తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే చాన్స్ పట్టేశాడు. మహేష్ అభిమానులను మాత్రమే కాకుండా.. సగటు సినీ ప్రేక్షకుడిని కూడా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మెప్పించాడు. మళ్లీ సంక్రాంతికి అదిరిపోయే హిట్ కొట్టాడు. అయితే అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ విషయమై ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఎఫ్2 సీక్వెల్..
సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అయితే ఎఫ్2 సీక్వెల్ చేసే ఆలోచన ఉందని, అది కూడా లైన్లోనే ఉందని చెప్పుకొచ్చాడు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఎఫ్2 సీక్వెల్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

మరో హీరో కూడా..
అయితే ఈ చిత్రంలో వరుణ్ తేజ్, వెంకటేష్ కాకుండా మరో హీరో కూడా ఉండబోతోన్నాడని సమాచారం. ఆయన మరెవరో కాదు కామెడీ పండించడంలో దిట్ట అయిన రవితేజ. అవును ఈ మాస్ మహారాజాను కూడా ఎఫ్3లో భాగం చేయబోతోన్నాడని టాక్ నడుస్తోంది.
Recommended Video

డిస్కోరాజా ఈవెంట్‌లో..
తాజాగా జరిగిన డిస్కోరాజా ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. రవితేజతో మరో చిత్రం చేయాలని అనుకుంటున్నానని చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ లెక్కన ఎఫ్3లో రవితేజ ఉండే చాన్స్ ఉందని కొందరు బలంగా నమ్ముతున్నారు. మరి వీటిపై దర్శక నిర్మాతలు స్పందించే వరకు ఎదురుచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











