అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. అక్కినేని - దగ్గుబాటి హీరోలతో నెక్ట్స్ మూవీస్?

Anil Ravipudi next movie: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ దర్శకుడి పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. మెగాస్టార్ గత రికార్డులను తిరగరాస్తుంది.

ఈ గ్రాండ్ సక్సెస్ తో అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. వరుసగా తొమ్మిది సినిమాలకు తొమ్మిది హిట్లు ఇచ్చిన దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశారు. రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి పేరు మార్మోగుతోంది. 'పటాస్'తో ప్రారంభమైన అనిల్ ప్రయాణం, 'ఎఫ్2', 'ఎఫ్3', 'భగవంత్ కేసరి', సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి సూపర్ హిట్లతో మరింత ఎత్తుకు చేరింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఏంటీ? అనే టాలీవుడ్ లో చర్చనీయంగా మారింది.

Anil Ravipudi Master Plan After Chiranjeevi Blockbuster Akkineni or Daggubati Hero Next

అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్‌ను అక్కినేని నాగార్జున తో సినిమా తీయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. ఎందుకంటే.. టాలీవుడ్ టాప్ హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవితో ' మన శంకర వర ప్రసాద్', బాలయ్య ' భగవంత్ కేసరి', ఇంక గత సంకాంత్రికి విక్టరీ వెంకటేష్ తో ' సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి..వరుస బ్లాక్ బస్టర్ సినిమాఅందించారు. ఇక మిగిలింది కింగ్ నాగార్జున మాత్రమే . దీంతో అనిల్ రావిపూడి ఇక అక్కినేని నాగార్జునతోనే అని అందరూ భావించారు. మరోవైపు కింగ్ తరువాత మూవీ 100 సినిమా ఈ సినిమా ఆయన సినిమా కెరీర్ లో చాలా ప్రత్యేకంగా.. ఈ నేపథ్యంలో సక్సెస్ పుల్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడికి అవకాశం ఇస్తారని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి.

కానీ, లేటెస్ట్ బజ్ ప్రకారం.. అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తో ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. 'ఏజెంట్' ఫలితం తర్వాత సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు, ఒక పవర్‌ఫుల్ కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేశారట అనిల్. అఖిల్‌లోని ఎనర్జీని మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేయాలన్నది దర్శకుడి ఆలోచనగా తెలుస్తోంది.

సాధారణంగా అనిల్ ఒక సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేసే స్టైల్‌కు పేరు. అదే వేగంతో అఖిల్ సినిమాను కూడా పూర్తి చేసి, అతనికి ఒక సాలిడ్ హిట్ ఇవ్వాలన్నది మాస్టర్ ప్లాన్‌గా ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉండగా, అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో 'లెనిన్' అనే పీరియడ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ ప్రేమకథపై మంచి అంచనాలున్నాయి.

మరోవైపు అనిల్ రావిపూడి తన ఫేవరెట్ హీరో వెంకటేష్ దగ్గుబాటితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటించనున్నారన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ తర్వాత వెంకటేష్-రానా కలిసి వెండితెరపై కనిపిస్తే, ఆ మల్టీస్టారర్‌పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. ఇది అనిల్ మార్క్ కొత్త కథా? లేక 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాకు సీక్వెలా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తన 10వ సినిమాకు సంబంధించిన ఐడియా పూర్తిగా సిద్ధమైందని, టైటిల్ కూడా ఫిక్స్ చేశానని తెలిపారు. అయితే ఆ టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుందని, ప్రస్తుతానికి రివీల్ చేయడం లేదని చెప్పారు. "టైటిల్ అనౌన్స్ చేసిన రోజే... 'వీడు మళ్లీ మొదలెట్టాడురా బాబు' అని తిట్టుకుంటారు" అంటూ తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేయనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవితో బ్లాక్‌బస్టర్ కొట్టిన తర్వాత అనిల్ రావిపూడి... అక్కినేని, దగ్గుబాటి హీరోలతో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తున్న టాక్. అయితే.. ఎవరితో సినిమా చేయబోతున్నారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. అక్కినేని వారికి ఓకే అన్నారా? లేదా దగ్గుబాటి ఫ్యామిలీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా? లేదా వేరే హీరోను లైన్ లో పెట్టబోతున్నారా? అనే ఉత్కంఠగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X