నందమూరి ఫ్యాన్స్ కి దసరా పండగ స్పెషల్.. అదిరిపోయేలా ప్లాన్ రెడీ.. తగ్గేదేలే!
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అయితే ఈ సినిమాతో పాటు మరో కూడా దసరాకి సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

బోయపాటి క్రేజ్
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అనిల్ రావిపూడి సినిమా
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అయిందని అంటున్నారు. అయితే ఈ సినిమా సంగతి పక్కన పెడితే బాలకృష్ణ అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.

ఆ సినిమా అయిన వెంటనే
అనిల్ రావిపూడి చెప్పిన కథ బాలకృష్ణకు బాగా నచ్చిందని దీంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు, దీనిని బాలకృష్ణ సైతం ధ్రువీకరించారు కూడా. ప్రస్తుతానికి వెంకటేష్, వరుణ్ తేజలతో ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

డబుల్ ఫీస్ట్
ఇక అలా ఈ దసరా బాలకృష్ణ అభిమానులకు డబుల్ ఫీస్ట్ ఉంటుందని అంటున్నారు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ముందుగా, బాలకృష్ణ యాక్షన్ చిత్రం అఖండ అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. రెండవది, పండుగ సమయంలో కూడా అనిల్ రావిపూడితో సినిమా అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు.

ట్రాక్ రికార్డ్
నాని టక్ జగదీష్ సినిమాని నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ నిర్మాతలు, దసరా సమయాన బాలకృష్ణ-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. బ్లాక్ బస్టర్స్ మాత్రమే అందించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ తోడు కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
Recommended Video

భారీ అంచనాలు
అంతేకాకుండా, అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ సినిమాలు అందించడంలో ఫేమస్ అయ్యారు. నిజానికి ఆయన సినిమాలు అంటేనే ఒకరకంగా ఫుల్ మీల్స్ లాగా ఉండబోతుంది అని అంటున్నారు. కాబట్టి అభిమానులు ఈ కాంబినేషన్ నుండి పటాస్ తరహాలో ఒక ఫుల్ పైసా వసూల్ సినిమాని ఆశిస్తున్నారు. బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











