నందమూరి ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. అదిరిపోయే మల్టీస్టారర్ రెడీ చేసిన అనిల్ రావిపూడి!
నందమూరి అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే రెండు విషయాలు ఏమిటంటే మొదటిది నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ, రెండవది నందమూరి హీరోల మల్టీస్టారర్ ప్రాజెక్ట్. అయితే మొదటిది ఎప్పుడు కుదురుతుందో లేదో తెలియదు కానీ రెండోది మాత్రం ఇప్పట్లో కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే తాజాగా నందమూరి హీరోల మల్టీస్టారర్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కించే అవకాశం కనిపిస్తోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ వివరాల్లోకి వెళితే.

బోయపాటితో బిజీగా
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఇప్పటి దాకా వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరగకపోయినా 12వ తేదీ నుంచి షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా రిలీజైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

గోపీచంద్ మలినేని సినిమా తరువాత
ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ సంతి సినిమా సంగతి పక్కన పెడితే బాలకృష్ణ అనిల్ రావిపూడి తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. అనిల్ రావిపూడి తాజాగా చెప్పిన కథ బాలకృష్ణకు బాగా నచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి వెంకటేష్ వరుణ్ తేజలతో ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

బాబాయ్ అబ్బాయ్ కలిసి
అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి సరికొత్త ప్రచారం మొదలైంది. అదేమిటంటే అనిల్ రావిపూడి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందించే అవకాశాలున్నాయని అంటున్నారు. నిజానికి తనకు పటాస్ ద్వారా అవకాశం ఇచ్చి తనను దర్శకుడిని చేసిన కళ్యాణ్ రామ్ కు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని రావిపూడి చెబుతూ ఉంటారు. అలాగే తను బాలకృష్ణ అభిమానిని అని కూడా చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరినీ కలిపి ఒక సినిమా చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Recommended Video

ఈ సారి ఫుల్ లెంత్ రోల్
నిజానికి నందమూరి హీరోలతో మల్టీస్టారర్ సినిమా ఒకటి వస్తే చూడాలని అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకుని తీసిన తెరకెక్కించిన కథానాయకుడు మహానాయకుడు సిరీస్లో కూడా నందమూరి కళ్యాణ్రామ్ కనిపిస్తారు. కానీ అది పెద్ద రోల్ మాత్రం కాదు తన తండ్రి హరికృష్ణ నిజజీవిత పాత్రను కళ్యాణ్ రామ్ పోషించారు. అలా కాకుండా ఒక ఫుల్ లెంత్ రోల్ లో ఇద్దరితో కలిసి ఒక సినిమా చేయాలని అనిల్ రావిపూడి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











