Anil Ravipudi: మల్టీస్టారర్‌ హీరోయిన్‌ ఫిక్స్.. నందమూరి హీరోకి జోడీ ఎవరంటే?

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే జోష్‌లో మరో ఎంటర్టైనర్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి మల్టీస్టారర్ ఫార్మాట్‌లో మరింత పెద్ద ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా.. హీరోయిన్ ఎవరు అనేది? సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇప్పటికే టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ జోడీగా నిలిచింది. F2, F3, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి.ఇక కళ్యాణ్ రామ్‌తో 'పటాస్' తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ అవ్వడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇద్దరి భిన్నమైన స్టైల్‌లను కలిపి పూర్తి ఎంటర్‌టైనర్‌గా కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ దశలోకి చేరింది. మే నాటికి పూర్తిగా పూర్తి చేసి, జూన్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగించి, జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

Anil Ravipudi Multistarrer Kayadu Lohar Bags Big Break Opposite Kalyan Ram

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ కలిసి నిర్మించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా నాన్-థియేట్రికల్ రైట్స్ విషయంలో జీ స్టూడియోస్ భారీగా ఇన్వెస్ట్ చేయనుండటం ఈ ప్రాజెక్ట్ స్థాయిని తెలియజేస్తోంది. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కేవలం ఒక సినిమా కాకుండా టాలీవుడ్‌లో మరో భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ కాంబినేషన్‌పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక కూడా హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ ను వెంకటేష్ సరసన ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మల్టీ స్టారర్ మూవీలో మరో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ పేరు కూడా వినిపిస్తోంది. అమ్మడు ఎవరో కాదు.. కయ్యదు లోహర్. ఈ హీరోయిన్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఆమె నటించిన 'ఫంకీ' సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటుండటం గమనార్హం.

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్‌ల కొరత ఉండటం కూడా కయ్యదు లోహర్‌కు ప్లస్‌గా మారింది. ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ నిర్మాతలను ఆకట్టుకుంటుండటంతో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు సుమారు కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా, అవకాశాలు మాత్రం భారీగా రావడం ఆమె అదృష్టం అనే చెప్పాలి.

ఇక టెక్నికల్‌గా కూడా ఈ ప్రాజెక్ట్ స్ట్రాంగ్‌గా ఉండబోతోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనుండగా, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి సినిమాలకు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన బలం కాబట్టి, ఈసారి కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వం అన్ని కలిసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X