మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

దర్శకధీరుడు రాజమౌళితో చేయబోయే సినిమా కంటే ముందు మహేశ్ బాబు.. రెండు చిత్రాలను చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం 'సర్కారు వారి పాట' పట్టాలపై ఉండగానే.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం అతడు కథలను వింటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ కుడుమల అతడికి కథలు చెప్పారు. వాటిని చేస్తానని చెప్పిన సూపర్ స్టార్.. ఎప్పుడు ప్రారంభించేది మాత్రం స్పష్టం చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ ఇద్దరు దర్శకులు వేరే హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.

Anil Ravipudi Narrated A Story to Mahesh Babu Again

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మహేశ్ బాబుకు అదిరిపోయే కథను వినిపించాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ సారి పంథాను మార్చి మరో ప్రయోగం చేద్దామని సదరు దర్శకుడికి తేల్చి చెప్పాడట సూపర్ స్టార్. దీంతో తన దగ్గర ఉన్న మరో స్టోరీని కూడా నేరేట్ చేశాడని అంటున్నారు. అనిల్ చెప్పిన ఈ కథకు మహేశ్ బాబు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. దీంతో ఈ లైన్‌ను తన కోసం లాక్ చేయమని అతడికి చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'సరిలేరు నీకెవ్వరు' వంటి ఇండస్ట్రీ హిట్ వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X