Anil Ravipudi: వెంకీ మామకు హీరోయిన్ ఫిక్స్.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi Next Movie: టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు అదే జోష్‌లో మరో ఎంటర్టైనర్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఆయన విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లను ఒకే తెరపైకి తీసుకురావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబో రీపిట్
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ టాలీవుడ్‌లో విజయవంతమైన కాంబినేషన్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో వచ్చిన 'F2','F3', 'సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో ఈ కాంబోపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ జోడీ ఐదోసారి కలిసి పనిచేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

Anil Ravipudi Next Movie Venkatesh-Kalyan Ram Multistarrer Keerthy Suresh Likely Heroine

మల్టీస్టారర్‌గా కొత్త ప్రయోగం
ఈసారి అనిల్ రావిపూడి సాధారణ కామెడీ ఎంటర్‌టైనర్ కాకుండా మల్టీస్టారర్‌గా సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో నటించనున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మలుపు తిప్పిన పటాస్ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే వచ్చింది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

హీరోయిన్‌గా కీర్తి సురేష్?
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. తాజా సమాచారం ప్రకారం నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వెంకటేష్‌తో కీర్తి సురేష్ జతకట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఈ జంటపై కూడా ఆసక్తి పెరిగింది. కీర్తి సురేష్ నటన, వెంకటేష్ కామెడీ టైమింగ్ కలిసి వెండితెరపై ప్రత్యేకమైన మ్యాజిక్ సృష్టిస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ఆ పాత్ర కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త హీరోయిన్ ను వెతుకుతున్నట్లు సమాచారం.

టెక్నికల్ టీమ్
ఈ సినిమాకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించనున్నట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి చేపట్టనున్నారని సమాచారం. నిర్మాణం విషయంలో కూడా పెద్ద బ్యానర్లు ముందుకు వస్తున్నాయి. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి సీజన్ ప్రత్యేకమైనది. గతంలో ఆయన తీసిన సినిమాలు పండగ సమయంలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే ఈ కొత్త చిత్రాన్ని కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

షూటింగ్ ఎప్పుడు?
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం - AK47' ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ కూడా తన సోలో ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ఈ మల్టీస్టారర్ కోసం డేట్స్ కేటాయిస్తున్నట్లు సమాచారం. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

భారీ అంచనాలు
వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి దర్శకత్వం అన్ని కలిస్తే ఈ సినిమా పక్కా ఎంటర్‌టైనర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఈ సంకాంత్రికి మరో బ్లాక్ బస్టర్ ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి దగ్గుబాటి, నందమూరి హీరోలు ఒకే తెరపై కనిపించబోతున్న ఈ మల్టీస్టారర్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడితే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X