అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఫిక్స్.. బాక్సాఫీస్ రికార్డ్‌లు బ్రేక్ అవ్వాల్సిందే !

Anil Ravipudi Next Movie: టాలీవుడ్‌లో ప్రస్తుతం హిట్ అంటే అనిల్ రావిపూడి అనే స్థాయికి చేరుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ దర్శకుడి పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం... మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి కెరీర్‌లో మరో సరికొత్త రికార్డును సృష్టించింది. స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో థియేటర్లలో ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది.

ఈ గ్రాండ్ సక్సెస్‌తో అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. ఇప్పటివరకు తెరకెక్కించిన తొమ్మిది సినిమాలకు తొమ్మిది విజయాలు అందించి, అపజయం ఎరుగని దర్శకుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 'పటాస్'తో మొదలైన ఆయన ప్రయాణం 'F2', 'F3', 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి కమర్షియల్ హిట్లను దాటి, ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు'తో కొత్త స్థాయికి చేరింది. రాజమౌళి తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడిగా అనిల్ పేరు వినిపించడం ఇప్పుడు సాధారణమే. దీంతో టాలీవుడ్‌లో ఒకే ఒక ప్రశ్న... అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఏంటి?

Anil Ravipudi Next Movie Victory Venkatesh Rana Daggubati Multistarrer Planned for Sankranthi 2027

అనిల్ రావిపూడి మరోసారి భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం పదేళ్ల వ్యవధిలోనే వరుసగా తొమ్మిది విజయాలు సాధించి, అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అనిల్.. ఇప్పుడు తన 10వ సినిమాను మరింత గ్రాండ్‌గా రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనిల్ తన తదుపరి సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని ఫిక్స్ అయినట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి లక్ష్యంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జూన్ నెల నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

వెంకటేష్‌తో మళ్లీ కాంబో?
ఈ ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇప్పటికే వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'F2', 'F3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం- హౌస్ నెం:47' సినిమాలో నటిస్తుండగా, మరోవైపు మలయాళ సూపర్ హిట్ సీక్వెల్ 'దృశ్యం 3' కూడా లైన్‌లో ఉంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో అనిల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

రానా కీలక పాత్ర? మల్టీస్టారర్ టాక్
ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్న అంశం... దగ్గుబాటి రానా పేరు. వెంకటేష్‌తో పాటు దగ్గుబాటి రానా కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇది నిజమైతే ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కే అవకాశం ఉంది. వినోదంతో పాటు పవర్‌ఫుల్ పాత్రలు ఉంటాయని, అనిల్ స్టైల్‌లో కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని టాక్.వరుస విజయాలు, కుటుంబ ప్రేక్షకుల నమ్మకం, సంక్రాంతి సీజన్ సెంటిమెంట్... ఈ మూడు అంశాలు మరోసారి అనిల్ రావిపూడిని 'సంక్రాంతి హీరో'గా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెంకీ-అనిల్ కొత్త సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇప్పటివరకు ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మాత్రమే. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ వెంకటేష్-అనిల్-రానా మల్టీస్టారర్ నిజమైతే... 2027 సంక్రాంతి టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా మారడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X