నందమూరి హీరోల కోసం ట్రై చేస్తున్న అనిల్.. మిగిలింది ఆయనొక్కరే?

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఒక సక్సెస్ వచ్చిన దర్శకుడు పెద్దగా గ్యాప్ తీసుకోడు. ఒక ప్రాజెక్ట్ హిట్టవుతుందనే పాజిటివ్ కామెంట్స్ వస్తున్నపుడే మరో సినిమాను ఎనౌన్స్ చేస్తారు. స్టార్ హీరోలు కూడా సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకులను అంత ఈజీగా వదులుకోరు. అయితే ప్రస్తుతం వరుస కమర్షియల్ హిట్స్ అందుకొని స్టార్ దర్శకుల జాబితాల్లో ఉన్న అనిల్ రావిపూడిని ఎవరు పట్టించుకోవడం లేదు.

అసలైతే అనిల్ రావిపూడికి కథను రాయడానికి పెద్దగా సమయం పట్టదు. సొంతంగా కథ రాసుకోవడమే కాకుండా మాటలు కూడా రాసుకుంటాడు. సరిలేరు నీకెవ్వరు స్క్రిప్ట్ కూడా మహేష్ ఒప్పుకున్న తరువాత కథను డెవలప్ చేసి ఒక నెలలోనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఆ సినిమా హిట్టయిన తరువాత కూడా ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Anil ravipudi next project with balakrishna

F3 స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ ఆ హీరోల డేట్స్ దొరకడం లేదు. ఇక మహేష్ తో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పట్లో కుడిరిలా లేదు. ఇక ఆయన నందమూరి హీరోలతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో ఆల్ రెడీ చేశాడు కాబట్టి నెక్స్ట్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే ఎన్టీఆర్ అయితే దొరికే ఛాన్స్ లేదు కాబట్టి బాలకృష్ణ ఒక్కడే అందుబాటులో ఉన్నాడు. బోయపాటి శ్రీనివాస్ తరువాత ఇంకా బాలయ్య తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. బి.గోపాల్ తో అనుకున్నప్పటికి ఇంకా ఫైనల్ అవ్వలేదు. దీంతో అనిల్ ఈ గ్యాప్ ని ఉపయోగించుకోవాలని ట్రై చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X