Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి: ఈ గ్యాప్‌లో అదే పనిలో బిజీ
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన వారిలో యంగ్ సెన్సేషన్ అనిల్ రావిపూడి ఒకడు. కెరీర్ ఆరంభంలో ఎంతో మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా, స్టోరీ రైటర్‌గా పని చేసిన అతడు.. నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన 'పటాస్'తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ.. అన్నింటినీ హిట్లుగా చేసుకున్నాడు. తద్వారా బడా హీరోల నుంచి సైతం ఆఫర్లు అందుకుంటున్నాడు. గత ఏడాది మహేశ్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' వంటి ఇండస్ట్రీ హిట్‌ను చేసిన అతడు మరో భారీ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రాల్లో 'రాజా ది గ్రేట్' ఒకటి. మాస్ మహారాజా హీరోగా చేసిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో హీరో పాత్ర అంధుడిగా కనిపించినా.. అతడితో సినిమా మొత్తం ట్రావెల్ చేయించిన విధానం ఆకట్టుకుంది. దీంతో అనిల్‌కు ప్రశంసలు కూడా దక్కాయి. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' సీక్వెల్‌కు కథ రెడీ చేస్తున్నాడట.
ఇటీవల అనిల్ రావిపూడి కరోనా వైరస్ బారిన పడ్డాడు. తిరిగి దీని నుంచి కోలుకున్న వెంటనే ఆ సీక్వెల్ స్క్రిప్టు వర్కునే ప్రారంభించాడని తెలుస్తోంది. అది పూర్తయిన తర్వాత రవితేజను సంప్రదించబోతున్నాడని అంటున్నారు. ఆయనకు కనుక ఇది నచ్చితే వెంటనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అనిల్ 'ఎఫ్3' మూవీని రూపొందిస్తున్నాడు. దీని తర్వాత నందమూరి బాలకృష్ణతోనూ ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటి మధ్యలోనే 'రాజా ది గ్రేట్' సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.