వెంకీ, వరుణ్, రవితేజ ముగ్గురూ కలసి.. అనిల్ రావిపూడి క్రేజీ ప్లాన్!

Recommended Video

Anil Ravipudi Plans For F3 Movie | Filmibeat Telugu

అనిల్ రావిపూడి వరుస నాలుగు సూపర్ హిట్స్ తో టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా మారిపోయాడు. అనిల్ రావిపూడి దర్శత్వం వహించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి. ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ వారంలో కూడా ఎఫ్2 వసూళ్ల జోరు తగ్గడం లేదు. వెంకటేష్ ఈ చిత్రంలో కామెడీతో భీభత్సం సృష్టించాడు. వరుణ్ తేజ్ తెలంగాణ యాసలో మంచి నటన కనబరిచాడు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందంటూ వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.

కలెక్షన్లు అదుర్స్

కలెక్షన్లు అదుర్స్

రెండవ ప్రారంభమయ్యే సరికే ఎఫ్2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ 32 కోట్లు. దీనితో బయ్యర్లు ఇప్పటికే భారీ లాభాలు అందుకుంటున్నారు. ఎఫ్2 చిత్రం వెంకీ, వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి రోజులని గుర్తు చేశాడు.

ఎఫ్2కు సీక్వెల్

ఎఫ్2కు సీక్వెల్

ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఎఫ్2 చిత్రంలో కూడా అనిల్ రావిపూడి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ ఎఫ్3 కూడా ఉంటుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఎఫ్3 కోసం అనిల్ రావిపూడి భారీ ప్లానింగ్ నే సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎఫ్3 లో మాస్ మహారాజ రవితేజ కూడా ఉండబోతున్నాడట. రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాజా ది గ్రేట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

ముగ్గురితో కలసి

ముగ్గురితో కలసి

వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ముగ్గురితో అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రానికి కథ రెడీ చేస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. రాజా ది గ్రేట్ చిత్రంలోని రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ నే ఇందులో కూడా చూపించబోతున్నాడట. ఆ పాత్రలోనే రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ హాస్యాన్ని పండించాడు. ఎఫ్3 లో మరింత ఫన్ ఉండేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి చిత్రాలలో

సంక్రాంతి చిత్రాలలో

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలలో ఎఫ్2 చిత్రం బిగ్గెస్ట్ హిట్‌‌గా నిలిచింది. వెంకటేష్ చాలా కాలం తర్వాత ఫుల్ లెన్త్ కామిక్ రోల్ లో కనిపించాడు. వరుణ్ తేజ్ నటన, తమన్నా, మెహ్రీన్ గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ చిత్ర విజయాన్ని కారణమయ్యాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X