అనిల్ రావిపూడి - చిరంజీవి ప్రాజెక్ట్.. పది రెట్ల రెమ్యునరేషన్ పెంచేసిన డైరెక్టర్.. ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఓటమిని చవిచూడకుండా.. ఎంతో శ్రద్ధగా, ఆడియెన్స్ ను మెప్పించేలా సినిమాలు చేస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని అనిల్ రావిపూడి చిత్రాలు తెరకెక్కుతుండటం విశేషం. దీంతో ఆయన నుంచి ప్రాజెక్ట్స్ కు మంచి మార్కెట్ కూడా ఏర్పడుతోంది. అంచనాలను మించి హిట్ అవుతుండటం విశేషం.
ప్రస్తుతం అనిల్ రావిపూడి భారీ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఎఫ్2, ఎఫ్3 తర్వాత వెంకీ - అనిల్ కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. 2025 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు చేసింది. మరోవైపు అనిల్ రావిపూడి కెరీర్ లో ఈ చిత్రం తెలుగు రిలీజ్ లో హయ్యేస్ట్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు రాబడుతూనే ఉండటం విశేషం.

అయితే వరుసగా హిట్లను అందుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి.. తన రాబోయే చిత్రానికి తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరూ', 'ఎఫ్3', 'భగవంత్ కేసరి', 'సంక్రాంతికి వస్తున్నాం'తో హిట్ అందుకొని టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. దీంతో అనిల్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రానికి మరింత హైప్ పెరిగాయి. పైగా తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉండటం ఇంకా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో అనిల్ ఈ ప్రాజెక్ట్ కు తీసుకుంటున్న పారితోషికం హాట్ టాపిక్ గ్గా మారింది.
'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రానికి ముందే అనిల్ రావిపూడి మెగాస్టార్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ కాస్తా బ్రేక్ తీసుకొని ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. కాగా అనిల్ రావిపూడి ఈ చిత్రానికి రూ.25 కోట్ల వరకు ఛార్జీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. తన మొదటి సినిమా 'పటాస్'కు రూ.2 కోట్లు మాత్రమే తీసుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు పదిరెట్లు పెంచేసి ఇరవై ఐదు కోట్లు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. అనిల్ రావిపూడి కష్టపడి ఎదిగిన తీరుకు అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరింత సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఎక్కడా తగ్గలేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవితో ప్రేక్షకులను ఎలా అలరిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. పైగా మెగాస్టార్ కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ను అనిల్ రావిపూడి ఏమేరకు తెరపై చూపిస్తారోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. 'సంక్రాంతికి వస్తున్నాం' లానే ఉంటుందని, కానీ కొన్ని మార్పులు చేసి మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే కథను రెడీ చేస్తున్నట్టు గతంలో అనిల్ రావిపూడి ఓ సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











