క్రేజీ ప్రాజెక్ట్‌తో అనిల్ రావిపూడి రెడీ.. ఒకేసారి ముగ్గురు హీరోలతో..?
ఇంతవరకు పెద్దగా ఫెయిల్యూర్ ని టచ్ చేయని యువ దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. కమర్షియల్ జోన్ లో నిర్మాతలకు మంచి లాభాలను అందించే విధంగా అనిల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. దీంతో నిర్మాత దిల్ రాజు అతన్ని ఏ మాత్రం వదిలిపెట్టడం లేదు. నెక్స్ట్ కూడా అనిల్ మళ్ళీ దిల్ రాజు సంస్థలోనే సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక లాక్ డౌన్ లో F2 తరహాలోనే F3కి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశాడు అనిల్. వైరస్ తీవ్రత తగ్గిన తరువాత వీలైనంత త్వరగా ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ఏడాది షూటింగ్స్ మొదలైన కూడా వెంకటేష్ బయటకు రానని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. దీంతో సంక్రాంతికి F3ని స్టార్ట్ చేయాలని దిల్ రాజు ఒక కొత్త ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే F3 కంటే ముందే మినీ బడ్జెట్ లోనే అనిల్ ఒక చిన్న సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి ప్లాన్ రెడీ అవ్వడంతో అనిల్ టార్గెట్ మొత్తం F3పైనే పడినట్లు తెలుస్తోంది. ఆ కథకు వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఫిక్స్ అవ్వగా మరో హీరో కోసం దిల్ రాజు చర్చలు జరుపుతున్నారు. అక్టోబర్ లోగా పరిస్థితులను బట్టి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి షెడ్యూల్స్ ప్లాన్ ని రెడీ చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి F3 సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











