అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీకి రికార్డ్ డీల్.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లంటే?

Anil Ravipudi - Venkatesh Movie OTT Rights: టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ముందుంటారు. తక్కువ సమయంలో, కంట్రోల్డ్ బడ్జెట్‌లో సినిమా పూర్తి చేసి, నిర్మాతలకు లాభాలు అందించే దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు. ఇప్పుడు పేరు మరోసారి నిజమవుతోంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ దగ్గుబాటి - నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాకముందే ఈ సినిమాకు భారీ బిజినెస్ వచ్చినట్టు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్‌' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు డైరెక్టర్‌ అనిల్ రావిపూడి. ఈ మూవీ సక్సెస్‌ను జోష్ లో 2027 సంక్రాంతికి విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కళ్యాణ్ రామ్‌ కాంబోలో ఓ మల్టీ స్టారర్ మూవీని సెట్ చేశాడని తెలిసిందే. అయితే వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కృతిశెట్టి నందమూరి కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా కనిపించబోతుందట. షైన్ స్రీన్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ మూవీని సమర్పిస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీ సెట్స్‌పైకి కూడా రాలేదు. అయినప్పటికి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులు ఇప్పటికే క్లోజ్ అయ్యాయని ట్రేడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Anil Ravipudi Venkatesh Movie OTT Rights Sold for Record Price Before Shoot Begins

అనిల్ రావిపూడి సినిమాలకు థియేటర్లలో ఎంత క్రేజ్ ఉంటుందో, ఓటీటీలో కూడా అంతే డిమాండ్ ఉంది. ఆయన గత చిత్రాలు థియేట్రికల్‌గా భారీ విజయాలు సాధించడమే కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా దీర్ఘకాలం ట్రెండ్ అవుతూ రికార్డులు సృష్టించాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఆయన కథన శైలి, కామెడీ టచ్, ఎమోషనల్ కనెక్ట్ ఇవన్నీ కలిసి ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాయి. అందుకే స్ట్రీమింగ్ సంస్థలు ఆయన ప్రాజెక్ట్స్‌పై భారీగా పెట్టుబడి పెట్టడానికి వెనుకాడారని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

ఈ మల్టీ స్టార్ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ 5 (ZEE5) దక్కించుకున్నట్లు టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దాదాపు రూ.60 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత ఓటీటీ మార్కెట్ కొంత స్లోగా ఉన్నా.. ఈ రేంజ్ డీల్ కుదరడం అనిల్ రావిపూడి బ్రాండ్ పవర్‌ను స్పష్టంగా చూపుతోంది. ఇక శాటిలైట్, ఇతర నాన్-థియేట్రికల్ హక్కులను కలుపుకుంటే మొత్తం బిజినెస్ రూ.70 కోట్లకు పైగానే అదనంగా ట్రేడ్ అంచనా. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఇంత భారీ రికవరీ రావడం నిర్మాతలకు పెద్ద రిలీఫ్‌ అనే చెప్పాలి. అనిల్ రావిపూడి ఎప్పటిలాగే బడ్జెట్‌ను కంట్రోల్‌లో ఉంచుతూ, రికవరీ మోడల్‌ను ముందుగానే ప్లాన్ చేయడం నిర్మాతలకు మరింత భరోసా కలిగిస్తుంది అందుకే ఆయనను ఇండస్ట్రీలో "ప్రొడ్యూసర్ల డైరెక్టర్"గా పిలుస్తారు.

ఈ సినిమా 2026 జూన్ చివరి వారంలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మూడు ప్రధాన షెడ్యూల్స్‌లో పూర్తి చేసి, 2027 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు భారీ డిమాండ్ ఉంది, ఈ సినిమా కూడా అదే ట్రెండ్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా యాక్షన్ సినిమాలు ట్రెండ్‌లో ఉన్నా, అనిల్ రావిపూడి మాత్రం తన కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాతో ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పిస్తున్నాడు. ఇదే కారణంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X