అబ్బాయ్ డైరెక్టర్ తో బాలయ్య..వివి వినాయక్ నో.. దుమ్ము దుమారమే!

Recommended Video

Anil Ravipudi To Direct Balakrishna

బాలకృష్ణ 2018 సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించారు. బాలయ్య నటించిన జై సింహ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. కాగా బాలకృష్ణ తరువుపరి చిత్రంపై ఆసక్తికర ప్రచారాలు మొదలయ్యాయ. ఏడాదికి రెండు మూడు చిత్రాలలో నటిస్తున్న బాలయ్య కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.

తేజ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం ఆవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. బాలయ్యని మరో చిత్రంలో నటింప జేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జై సింహా నిర్మాత సి కళ్యాణ్ బాలకృష్ణతో మరో చిత్రాన్ని నిర్మించాలనే యోచనలో ఉన్నాడట.

జైసింహాతో ఫుల్ జోష్ లో బాలయ్య

జైసింహాతో ఫుల్ జోష్ లో బాలయ్య

జై సింహా చిత్రం విజయం సాధించడంతో బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు. హుషారుగా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు

ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు

బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ఇంకా ప్రారంభం కాలేదు.

 ఆలస్యమయ్యే అవకాశం

ఆలస్యమయ్యే అవకాశం

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తేజ వెంకటేష్ తో కూడా ఓ చిత్రానికి కమిటై ఉండడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ 2019 ఎన్నికల ముందు విడుదల చేయడమే టార్గెట్. దానికి ఇంకా టైం ఉండడంతోనే ఈ ఆలస్యం జరుగుతోందనేది కొందరి వాదన.

 ఈ గ్యాప్ లో ఓ సినిమా

ఈ గ్యాప్ లో ఓ సినిమా

ఈ గ్యాప్ లో బాలయ్యతో ఓ సినిమా చేయాలని జై సింహా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

వివి వినాయక్ నో

వివి వినాయక్ నో

సి కళ్యాణ్ బాలయ్యతో సినిమా కోసం దర్శకుడు వివి వినాయక్ ని సంప్రదించారట. కానీ తనకున్న ఇతర కమిట్మెంట్స్ వలన చేయలేనని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

అబ్బాయి డైరెక్టర్ వద్దకు

అబ్బాయి డైరెక్టర్ వద్దకు

దీనితో సి కళ్యాణ్ పటాస్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడిని బాలయ్యతో సినిమా కోసం ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. ప్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కు పటాస్ చిత్రంతో అనిల్ సూపర్ హిట్ ఇచ్చాడు.

సూపర్ ఫామ్ లో డైరెక్టర్

సూపర్ ఫామ్ లో డైరెక్టర్

అనిల్ రావిపూడి పటాస్, సుప్రీం మరియు రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా హిట్లు అందుకున్నాడు. ఇలాంటి దర్శకుడితో బాలయ్య సినిమా చేస్తే అదిరిపోవడం ఖాయం అని నందమూరి ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X