అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్.. ‘మహావతార్' స్పూర్తితో భారీ ప్లాన్!
టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో సెన్సేషన్ సృష్టిస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi). కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో తనకంటూ ప్రత్యేక శైలి నెలకొల్పిన ఆయన, హిట్‌ల పరంపరతో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత అత్యధిక సక్సెస్ రేట్‌ను కొనసాగిస్తున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు ప్రస్తావనకు వస్తుంది.
ఇటీవల చిరంజీవి నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అయితే, ఈసారి తన కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన దిశగా అడుగులు వేస్తున్నారట. ఇంతకీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏమిటి? అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఏంటీ?

ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి టార్గెట్‌గా ప్లాన్ చేయడానికి కావలసిన సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతుండగా, షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానున్నదట. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా కీర్తి సురేష్ , నందమూరి కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతిశెట్టి కనిపించబోతుందట. ఇప్పటికే వెంకీ మామతో 5 సార్లు, తనకు మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్‌తో మరోసారి కలిసి పని చేయడం స్పెషల్. దీంతో అనిల్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెంచేశాయి.
ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి.. యానిమేషన్ జానర్‌లో భారీ ప్రాజెక్ట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. గతంలో వచ్చిన యానిమేషన్ మూవీ మహావతార్ సక్సెస్ ఇండస్ట్రీలో కొత్త ధోరణికి నాంది పలికింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి కూడా రామాయణం ఆధారంగా యానిమేషన్ చిత్రాన్ని రూపొందించాలని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే పూర్తి రామణ కథ కాకుండా, అందులోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఎంపిక చేసి, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని స్టోరీ తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో అటు మల్టీ స్టారర్ మూవీతో పాటు యానిమేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నట్లు ఉన్నాయి.
టాలీవుడ్ టాక్ ప్రకారం.. ఈ యానిమేటేడ్ మూవీకి సంగీత దర్శకుడిగా గౌర హరి ఎంపికయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల హనుమాన్ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ ప్రాజెక్ట్‌కు ఆయనను తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ యానిమేషన్ ప్రాజెక్ట్‌ను KVN ప్రొడక్షన్స్ నిర్మించనున్నదట. ఈ ఇప్పటికే దక్షిణాదిలో భారీ సినిమాలను నిర్మిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ ప్రాజెక్టు తెరకెక్కించాలని భావిస్తున్నట్టు టాక్.
అనిల్ రావిపూడి ఇప్పటివరకు 'పటాస్'నుంచి 'మన శంకరవరప్రసాద్' వరకు వరుస హిట్స్‌తో తనదైన మార్క్‌ను చూపించారు. అయితే ఈసారి ఆయన ఎంపిక యానిమేషన్ జానర్ ఆయన కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తన ట్రేడ్‌మార్క్ కామెడీని యానిమేషన్‌లో ఎలా మిళితం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రామాయణంలోని ఏ ఘట్టాన్ని ఎంచుకుంటారు? దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications



















