Tripti Dimri: చిరంజీవికి హ్యాండ్ ఇచ్చి... యానిమల్ బ్యూటీని లైన్‌లో పెట్టిన అనిల్ రావిపూడి
దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈయన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉండనుందని వార్తలు వచ్చాయి. చిరుకు మంచి కథను సిద్దం చేశారని.. త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని అన్నారు. అయితే చిరంజీవికి అనిల్ రావిపూడి హ్యాండ్ ఇచ్చి... మరో హీరో కోసం ఏకంగా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని లైన్ లో పెట్టారని తెలుస్తోంది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తీసిన ప్రతి సినిమా హిట్టే. ఇటీవల బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమా తీసి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ దర్శకుడు తర్వాతి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉండనుందని వార్తలు వచ్చాయి. చిరు కూడా భోళా శంకర్ ప్లాప్ తర్వాత ఆచి తూచి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్టతో తన 156వ చిత్రం చేస్తున్నాడు.

ఇక ఆ చిత్రం తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నాడు అనే వార్తలు వచ్చాయి. అయితే అనిల్ రావిపూడి చిరంజీవికి హ్యాండ్ ఇచ్చి మరో హీరోతో తన సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న విశ్వంభర సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే లోపు తాను ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు అనిల్ రావిపూడి.
అందుకే తనకు హిట్ ఇచ్చిన పాత హీరోనే మళ్లీ సెలెక్ట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. రాజా ది గ్రేట్ తో సూపర్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి, మాస్ మహారాజ్ రవితేజ.. మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. మొదట రవితేజతో ఓ సినిమా చేశాకే చిరంజీవి సినిమా మొదలు పెట్టనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం దిల్ రాజు మరోసారి నిర్మాతగా వ్యవహారించనున్నారు.

రవితేజ, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జనవరిలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. పూజా కార్యక్రమాల అనంతరం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. అయితే రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఆ సినిమా కొన్ని నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అందుకే మొదట రవితేజతో అనిల్ రావిపూడి సినిమాను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ బ్యూటీ యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా కంటే ఈ బ్యూటీకే ఎక్కువగా పేరు వచ్చింది. అలాంటి క్రేజీ బ్యూటీని ఈ సినిమా కోసం దర్శకుడు లైన్ లో పెట్టారని తెలుస్తోంది. రవితేజ, తృప్తి రొమాన్స్ ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











