Animal Park: ‘యానిమల్ పార్క్' స్టోరీ రివీల్.. ఇక బాక్సాఫీస్ వద్ద సందీప్ రెడ్డి అరాచకమే!

Animal Park: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సినిమాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా స్పిరిట్ (Spirit) అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే..ప్రభాస్ మూవీ తరువాత సక్సెస్ పుల్ మూవీ 'యానిమల్'కి సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ పార్క్ (Animal Park)పై కీలక అప్‌డేట్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమన్నారంటే?

జపాన్‌లో యానిమల్ (Animal) స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ... 'యానిమల్ పార్క్' షూటింగ్ 2027 మధ్యలో ప్రారంభమవుతుంది' అని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం తాను ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ (Spirit) పూర్తయ్యాకే ఈ సీక్వెల్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతానని చెప్పారు.

Animal Park Update Sandeep Reddy Vanga Confirms 2027 Shoot Ranbir Kapoor in Dual Role After Spirit

యానిమల్ పార్క్ స్టోరీ ఇదే

సీక్వెల్ టైటిల్ వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను కూడా సందీప్ రెడ్డి వంగా ఓపెన్ చేశారు. యానిమల్ పార్ట్ 1లో మీరు ఒక 'యానిమల్'ని చూశారు. పార్ట్ 2లో అలాంటి మరిన్ని యానిమల్ క్యారెక్టర్లు కనిపిస్తాయి. ముఖ్యంగా అజీజ్ కూడా ఒక యానిమల్ లాంటివాడే. ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే భీకర యుద్ధమే ఈ కథ. అందుకే దీనికి 'యానిమల్ పార్క్' అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా అనిపించింది' అని వివరించారు. పార్ట్ 1 కంటే ఈ సినిమా మరింత అగ్రెసివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు.

రణ్‌బీర్ డబుల్ రోల్ - వంగా మాస్టర్ ప్లాన్
యానిమల్ సీక్వెల్‌లో రన్ బీర్ కపూర్ (Ranbir Kapoor) డబుల్ రోల్‌లో కనిపించనున్నారు. హీరో రణ్‌విజయ్ సింగ్‌తో పాటు, విలన్ అజీజ్ హక్ పాత్రను కూడా రణ్‌బీర్‌నే పోషించబోతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడే స్థాయిలో క్రూరంగా ఉండే క్యారెక్టర్లు కావడంతో, సినిమా మొత్తం హై వోల్టేజ్ ఎమోషన్స్, రక్తికట్టించే యాక్షన్‌తో సాగుతుందని ఇండస్ట్రీ టాక్. హీరో రణ్‌బీర్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. 'సందీప్ సెట్స్‌లోకి మళ్లీ వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. పార్ట్ 1 షూటింగ్ టైమ్‌లోనే పార్ట్ 2 కథపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. ఈ రెండు పాత్రలను ఎక్స్‌ప్లోర్ చేయడం నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది' అని చెప్పారు.

యానిమల్ మూవీ దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. వయొలెన్స్, డార్క్ థీమ్స్‌పై విమర్శలు వచ్చినా... వంగా తన కథన శైలి,రగ్డ్ ఎమోషన్స్‌తో మార్కెట్‌లో తన సత్తా నిరూపించారు. ఇప్పటికే 'సందీప్ రెడ్డి వంగా' అనేది కేవలం దర్శకుడి పేరు కాదు ఒక బ్రాండ్ గా మారిపోయిందన్నది ఇండస్ట్రీ మాట. ప్రస్తుతం వంగా దృష్టంతా 'స్పిరిట్'పై ఉంది. ఆ తర్వాతే 'అనిమల్ పార్క్' స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి 2027లో షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రణ్‌బీర్ కూడా అప్పటివరకు తన ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసి అందుబాటులోకి రానున్నారు.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం,'యానిమల్ పార్క్' షూటింగ్ 2027 జూన్ లేదా జూలైలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కథ మొత్తం రణ్‌విజయ్- అజీజ్ మధ్య జరిగే హోరాహోరీ పోరాటం చుట్టూనే తిరుగుతుందని సమాచారం. పార్ట్ 1 కంటే యాక్షన్, ఎమోషన్స్ రెట్టింపు స్థాయిలో ఉంటాయని టాక్. ఇలా ప్రభాస్ 'స్పిరిట్' తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్న 'యానిమల్ పార్క్' ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. డబుల్ రోల్‌లో రణ్‌బీర్, మరింత డార్క్ కథ, వంగా మార్క్ ఇంటెన్సిటీ... ఇవన్నీ కలిసి ఈ సీక్వెల్‌ను ఇండియన్ సినిమాల్లో మరో సంచలనంగా మార్చే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ థియేటర్లలో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X