twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతవాసి సినిమా తరువాత కూడా.. మరీ ఇంత డిమాండా!

    |

    ఈ ఏడాది ఆరంభంలో పవన్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం అభిమానులని సైతం తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తరువాత పవన్ రాజకీయాలతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా మారాడు. తమిళంలో దుమ్మురేపుతున్న యువ సంగీత దర్శకుడు అనిరుద్ కు అజ్ఞాతవాసి చిత్రంతో చేదు అనుభవమే ఎదురైంది. కొంత గ్యాప్ తరువాత అనిరుద్ మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

    జెర్సీ చిత్రంతో

    జెర్సీ చిత్రంతో

    నేచురల్ స్టార్ నాని నటించబోతున్న క్రికెట్ కథాంశంతో రూపొందుతున్న జెర్సీ చిత్రానికి అనిరుద్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

     అజ్ఞాతవాసి తరువాత కూడా

    అజ్ఞాతవాసి తరువాత కూడా

    అజ్ఞాతవాసి చిత్రం విజయం సాధించి ఉంటె టాలీవడ్ దర్శక నిర్మాతలంతా అనిరుద్ కోసం క్యూ కట్టేవారు. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది. జెర్సీ చిత్రానికి కూడా అనిరుద్ కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

     పారితోషకం

    పారితోషకం

    అనిరుద్ మొదట ఈ చిత్రం కోసం 1.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ దర్శక నిర్మాతలు చివరకు 80 లక్షలకు అనిరుద్ ని ఒప్పించారట. క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో వైవిధ్యమైన సంగీతం అవసరం. అందుకే అనిరుద్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

    మంచి సంగీతమే

    మంచి సంగీతమే

    వాస్తవానికి అనిరుద్ అజ్ఞాతవాసి చిత్రానికి మంచి సంగీతమే అందించాడు. కానీ తెలుగు నేటివిటీకి సరిపోలేదు. పైగా సినిమా నిరాశపరచడం కూడా అనిరుద్ కు మైనస్ గా మారింది.

    English summary
    Anirudh demands huge remuneration for Jersey movie. Nani playing as cricketer in Jersey
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X