అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి ఫిక్స్? కన్ఫార్మ్ చేసిన సీనియర్ నటుడు

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అధినేత కావ్యా మారన్ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఇరు కుటుంబాలు గానీ, అనిరుధ్ లేదా కావ్యా మారన్ గానీ అధికారికంగా స్పందించలేదు. గతంలో ఈ ప్రచారాన్ని అనిరుధ్ ఖండించినప్పటికీ, ఇటీవల తమిళ సినీ వర్గాల్లో ఈ చర్చనీయంగా మారాయి. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు, నాటకరంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
వారణాసి స్టోరీ లీక్ చేసిన రాజమౌళి.. మహేశ్ సినిమాలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?
వారణాసి స్టోరీ లీక్ చేసిన రాజమౌళి.. మహేశ్ సినిమాలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?

వైజీ మహేంద్రన్ ఏమన్నారు?
తాజాగా వై.జి. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిరుధ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అనిరుధ్ ది సాఫ్ట్ నేచర్. అతడు ఎంతో టాలెంటెండ్, డిస్పిన్. అయితే ఏదో ఒక కారణం అతడిని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోంది. ఆ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నాను'అని తెలిపారు. అంతే కాకుండా, 'నేను కూడా విన్న విషయాలనే చెబుతున్నాను. ప్రచారం జరుగుతున్నట్టు ఆ వివాహం జరిగితే చాలా సంతోషం. వీరిద్దరి జోడీ చాలా బాగుంటుంది. మంచి జంటగా పేరు తెచ్చుకుంటారు' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Recommended For You
 అలా రాయకండి.. త్వరలో నిజం చెబుతా .. రంగస్థలం మహేష్ ఎమోషనల్ వీడియో!
అలా రాయకండి.. త్వరలో నిజం చెబుతా .. రంగస్థలం మహేష్ ఎమోషనల్ వీడియో!
Anirudh-Kavya Maran Wedding Buzz Y G Mahendran s Viral Comments Explained

ఈ కామెంట్స్ చేస్తుంటే..అనిరుధ్ ఇష్టానికి ఇంట్లో వాళ్లు చాలా గౌరవం ఇస్తారని తెలుస్తోంది. అలాగే. కొందరు వారి వివాహానికి గ్రీన్ సిగ్నల్ దొరికిందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెబుతున్నారు. అనిరుధ్, కావ్యా మారన్ రిలేషన్‌షిప్‌పై చాలా రోజులు వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్ పై అనిరుధ్ స్వయంగా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంలో నిజం లేదని, అవి కేవలం పుకార్లేనని స్పష్టం చేశారు. అందువల్ల ప్రస్తుతం కూడా వారి వివాహం గురించి అధికారిక ప్రకటన వెలువడే వరకు వీటిని పుకార్లుగానే భావించాలి.

You May Also Like
MIB Day 9 Collections: వీకెండ్‌లో 'మా ఇంటి బంగారం' దూకుడు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?
MIB Day 9 Collections: వీకెండ్‌లో 'మా ఇంటి బంగారం' దూకుడు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇక కావ్య మారన్ విషయానికి వస్తే.. యంగ్ బిజినెస్ టైకూన్. సన్‌గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌, సన్‌టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ కావేరి కళానిధి ముద్దుల తనయే కావ్య. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ,సహ-యజమాని కూడా. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో స్టాండ్స్‌లో ఆమె ఇచ్చే హావభావాలు, ఎమోషన్స్ కారణంగా ఆమెను సోషల్ మీడియాలో 'ఐపీఎల్ మిస్టరీ గర్ల్' అని కూడా పిలుస్తారు. గతంలో 'సన్ టీవీ' ఓటీటీ విభాగానికి కావ్యా మారన్ బాధ్యతలు నిర్వహించింది.యువ వ్యాపారవేత్తగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

'24 ఏళ్ల వయసులో పెళ్లికాకుండానే తల్లీగా.. అతను అలా వదిలేసి పోయాడు’
'24 ఏళ్ల వయసులో పెళ్లికాకుండానే తల్లీగా.. అతను అలా వదిలేసి పోయాడు’

ఇక అనిరుధ్ విషయానికి వస్తే.. సంగీత సంచలనం..రాక్‌స్టార్‌ అనిరుధ్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.2012లో 'వై దిస్ కొలవెరి డి'పాటతో అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైల‌ర్‌, కూలీ, విక్ర‌మ్‌, లియో, దేవ‌ర పార్ట్ వ‌న్ వంటి ప‌లు భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జ‌వాన్‌ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు కూడా సంగీతం అందిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. సోషల్ మీడియా ఎలాంటి ప్రచారం జరిగినా అనిరుధ్, కావ్యా మారన్ లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు పుకార్లుగానే ట్రీట్ చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X