RRR సినిమా కోసం రంగంలోకి అనిరుధ్.. కీరవాణి ప్లాన్స్ మామూలుగా లేవు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత వస్తున్న బిగెస్ట్ యాక్షన్ మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా, నందమూరి హీరోల కలయికలో వస్తున్న సినిమా కావడంతో అన్ని వర్గాల అభిమానుల్లో కూడా అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక సంగీత దర్శకుడు కీరవాణి కూడా అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ను కూడా రంగంలోకి లాగుతున్నట్లు సమాచారం.

ప్రమోషన్ డోస్ పెంచాలని
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ తో పాటు అజయ్ దేవ్ గన్, అలియా భట్ పాత్రలు కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిల్వనున్నాయి. ఇక ప్రమోషన్ డోస్ పెంచాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ ను మొదలుపెట్టేసింది.

ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది
కరోనా మరోసారి బ్రేక్ వేస్తుందో లేదో తెలియదు గాని రాజమౌళి టీమ్ మాత్రం ప్రమోషన్ డోస్ పెంచేందుకు ఇక అస్సలు వెనుకడుగు వేయకూడదని డిసైడ్ అయ్యారు. ఇటీవల మేకింగ్ విడియోతోనే మంచి బజ్ క్రియేట్ చేశారు. సినిమాలో యాక్షన్ హవా కూడా గట్టిగానే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా నిర్మించినట్లు తెలుస్తోంది.

RRRలో అనిరుధ్ కూడా
ఇక సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా కోసం సరికొత్త మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఇప్పటికే ఆల్ మోస్ట్ అన్ని ట్యూన్స్ సెట్టయ్యాయి. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి సింగర్స్ ను కూడా ఆ లెవెల్లోనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ కూడా RRR లో ఒక పాట పాడుతున్నట్లు సమాచారం.
Recommended Video

పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లుగా..
అనిరుధ్ కేవలం సంగీతం అంధించడమే కాకుండా మిగతా సంగీత దర్శకుల కంపోజిగ్స్ లో కూడా సింగర్ గా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు. అలా అనిరుధ్ పాడిన చాలా పాటలు సినిమాలకు బాగానే హెల్ప్ అయ్యాయి. ఇక సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనిరుధ్ కు అభిమానులు ఉన్నారు కాబట్టి అతనితో పాట పాడిస్తే అద్భుతంగా ఉంటుందని ప్లాన్ చేశారట. మరి ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











